YSR Kapu Nestham Scheme Money: నేడే వారి ఖాతాల్లోకి వైఎస్సార్ కాపు నేస్తం డబ్బులు జమ

YSR Kapu Nestham Scheme Money: రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తూ 16వ తేదీ నాడు.. అంటే నేడే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో బటన్ నొక్కి  నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ఏపీ సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.

Written by - Pavan | Last Updated : Sep 16, 2023, 07:08 AM IST
YSR Kapu Nestham Scheme Money: నేడే వారి ఖాతాల్లోకి వైఎస్సార్ కాపు నేస్తం డబ్బులు జమ

YSR Kapu Nestham Scheme Money: రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తూ 16వ తేదీ నాడు.. అంటే నేడే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో బటన్ నొక్కి  నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ఏపీ సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం" ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారికి మంచి జరగాలన్న తపనతో.. ఏటా రూ. 15,000 చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తున్న ఏపీ సర్కారు నేడు 4వ విడత డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.

నేడు అందిస్తున్న రూ. 536.77 కోట్లతో కలిపి ఏపీ సర్కారు ఇప్పటివరకు మొత్తం ఆర్థిక సాయం రూ. 2,029 కోట్లు... ఒక్కో పేద కాపు అక్క చెల్లెమ్మకు నాలుగేళ్ళ కాలంలో అందించిన లబ్ధి అక్షరాలా రూ.60,000..

గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో 5 ఏళ్లలో సగటున ఏడాదికి కనీసం రూ. 400 కోట్లు కూడా ఇవ్వని దుస్థితి నెలకొందని... కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 52 నెలల్లోనే వివిధ పథకాల ద్వారా 77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు అనేక రెట్లు అధికంగా మొత్తం రూ. 39,247 కోట్ల లబ్ధి చేకూర్చినట్టు ఏపీ ప్రభుత్వం తమ తాజా ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి : ఐటీ ఉద్యోగులకు పోలీసు శాఖ నోటీసులు

గత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా, సంవత్సరానికి రూ. 1,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలలో రూ.5,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి.ఈ 5 సంవత్సరాలలో కేవలం రూ.1,340 కోట్లు కేటాయించిన నేపథ్యంలో, తమ పార్టీ అధికారంలోకి వచ్చాకా కాపు కార్పొరేషన్కు సం॥రానికి రూ.2,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలకు కలిపి రూ. 10,000 కోట్లు కేటాయిస్తాం, ఖర్చు చేస్తాం. ..అని మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కన్నా మిన్నగా కాపుల సంక్షేమం కోసం ఇప్పటివరకు కేవలం నాలుగేళ్లలో రూ. 39,247 కోట్ల లబ్ధి చేకూర్చాం.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కాపుల బలోపేతం కోసం విశేష కృషి.. సామాజిక సమతుల్యత పాటిస్తూ కాపులకు ఒక డిప్యూటీ సి.ఎంతో సహా ఏకంగా 4 మంత్రి పదవులు కేటాయింపు.. అన్ని నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో కాపు వర్గాలకు తగు ప్రాధాన్యత కల్పించాం అని వైఎస్సార్సీపీ వెల్లడించింది.

ఇది కూడా చదవండి : ఢిల్లీకి ఏపీ పంచాయితీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News