Eluru mysterious disease: రాష్ట్రవ్యాప్తంగా కలవరం కల్గిస్తున్న ఏలూరు వింత వ్యాధి పరిశీలనకు డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు ఏలూరు చేరుకున్నారు. వింత వ్యాధి పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు మరిన్ని బృందాలు రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిసరాల్లో ప్రజలు అంతు చిక్కని వ్యాధి బారిన పడుతున్న విషయం తెలిసిందే. మూర్ఛ, తలనొప్పి, నీరసం, మతి మరుపు, వాంతులు, వెన్నునొప్పి వంటి లక్షణాలతో వింత వ్యాధి గత వారం రోజుల్నించి పీడిస్తోంది. ఎన్ని రకాలైన పరీక్షలు చేసినా కారణం అంతు చిక్కడం లేదు.
ఏలూరు వింత వ్యాధి ( Eluru mysterious disease ) దర్యాప్తు, పరిశోధన కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు కోరారు. ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తి మేరకు డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు ( WHO Team ) ఇద్దరు ఏలూరు చేరుకున్నారని డీసీహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. వింత వ్యాధి పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు దేశంలోని వివిధ సంస్థల్నించి వైద్యులు, నిపుణుల బృందం రానుందని ఏవీఆర్ మోహన్ చెప్పారు.
ప్రస్తుతం ఏలూరులో వింత వ్యాధి కేసుల సంఖ్య కాస్త తగ్గిందని..కోలుకున్నవారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. దేశంలోని వివిధ సంస్థల బృందాలు శాంపిల్స్ సేకరిస్తున్నాయి. ఏలూరు నుంచి సేకరించిన నీళ్లు, మిల్క్ శాంపిల్స్ న్యూ ఢిల్లీ ఎయిమ్స్ ( Delhi AIIMS )కు పంపుతున్నారు. పూణేలోని నేషనల్ వైరాలజీ ఇనిస్టిట్యూట్ నుంచి నిపుణులు వస్తున్నారని డీసీహెచ్ఎస్ మోహన్ చెప్పారు.
ఏలూరు వింత వ్యాధి నుంచి కోలుకున్నవారిని కూడా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ 108 వాహనాలు సిద్ధంగా ఉంచారు. మరోవైపు భయాందోళనల వల్ల కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయన్నారు. Also read: AP: మూడు రాజధానులపై హైకోర్టులో ప్రభుత్వ వాదన నేటి నుంచి