Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. వరద బాధిత ప్రాంతాల పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో బాబు తప్పించుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోనసీమ జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పడవ దిగే క్రమంలో అపశృతి చోటుచేసుకుంది. సోంపల్లి గ్రామంలో పంటు దిగే క్రమంలో రెండు పడవలు ఒకదానికొకటి ఢీ కొని ప్రమాదం చోటుచేసుకుంది. రెండు పడవలు ఢీ కొనడంతో టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా ఒరిగిపోవడంతో దేవినేని ఉమా సహా అంతా నదిలో పడిపోయారు. అక్కడున్న స్థానిక మత్స్యకారాలు టీడీపీ నేతల్ని రక్షించారు. అయితే ఈ ప్రమాదం నుంచి చంద్రబాబు మాత్రం తప్పించుకున్నారు. చంద్రబాబు పడవ ఒరగకపోవడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. టీడీపీ నేతలు మాత్రం పడవలోంచి నదిలో పడిపోయారు. మానేపల్లిలో వరదల సందర్భంగా చనిపోయిన మృతుల కుటుంబాల పరామర్శ కోసం సోంపల్లి రేవు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
రాజోలు మండలం సోంపల్లి రేవులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ఆ పంటులో చంద్రబాబు సహా 15 మంది ఉన్నారు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వరద ముప్పు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ఇవాళ, రేపు కూడా జరగనుంది. ఆచంట, పి గన్నవరం, రాజోలు, పాలకొల్లు, నర్శాపురం ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాలికి బురద అంటకుండా హెలీకాప్టర్‌లో తిరిగితే ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయంటూ ప్రశ్నించారు.
Also read: Chandrababu: శ్రీలంక కంటే ఏపీలో పాలన దారుణంగా ఉంది..చంద్రబాబు హాట్ కామెంట్స్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook