విశాఖపట్నం వచ్చినప్పుడు కలుస్తానమ్మా: పవన్ కల్యాణ్

టాలీవుడ్ ప్రముఖ హీరో.. జనసేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయ‌న అభిమానులు, జ‌న‌సేన కార్యకర్తలు ఎన్నో కార్య‌క్ర‌మాలను చేప‌ట్టారు.

Last Updated : Sep 4, 2020, 09:52 AM IST
విశాఖపట్నం వచ్చినప్పుడు కలుస్తానమ్మా: పవన్ కల్యాణ్

Pawan Kalyan impressed with fan Art: టాలీవుడ్ ప్రముఖ హీరో.. జనసేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయ‌న అభిమానులు, జ‌న‌సేన కార్యకర్తలు ఎన్నో కార్య‌క్ర‌మాలను చేప‌ట్టారు. ఈ క్రమంలోనే విశాఖపట్నానికి చెందిన ఓ దివ్యాంగురాలు నోటితో పవన్ బొమ్మ డ్రాయింగ్ గీసి ఆయనపై త‌న‌కు ఎంత ప్రేమ ఉందో తెలియ‌జేసి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ప్రస్తుతం ఈ దివ్యాంగ యువతి ఆర్ట్ గీసి పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు చెప్పిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. Also read: Pawan Kalyan: పవన్ 28 మూవీ.. క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

స్వ‌ప్న అనే దివ్యాంగురాలు త‌న నోటితో పవన్ ఫోటోను అద్భుతంగా గీయగా.. దీనిని జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆర్ట్‌కు ఫిదా అయిన ప‌వ‌న్ క‌ల్యాణ్ దానిని ట్విట్టర్‌లో షేర్ చేసి వైజాగ్ వచ్చినప్పుడు త‌న‌ని త‌ప్ప‌క క‌లుస్తానని మాటిచ్చారు. మా బంగారు తల్లి స్వప్నకి.. నువ్వు వేసిన నా డ్రాయింగ్‌ను మన జనసైనికులు నా దృష్టికి తీసుకొచ్చారు, చాలా చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను.  జాగ్రత్త అమ్మా.. అంటూ పవన్ సోషల్ మీడియా వేదిక ద్వారా మాటిచ్చారు. Also read: Pawan Kalyan: పవన్ 27వ సినిమా అప్‌డేట్.. ఇదే

Trending News