Chandrababu Residence: జలాశయాలు, సముద్ర తీర ప్రాంతాల్లో అక్రమంగా నివాసాలు నిర్మించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నది ఒడ్డున ఇల్లు నిర్మించుకున్న చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందు చంద్రబాబు ఇల్లు కూల్చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సూచించారు. 'ఎక్స్' వేదికగా చంద్రబాబు ఉండవల్లి నివాసంపై విజయ సాయిరెడ్డి ప్రశ్నలు సంధించారు.
Also Read: YS Viveka Murder Case: వైఎస్ జగన్ చెల్లెలు సంచలనం.. సీఎం చంద్రబాబుతో భేటీ
అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు నాయుడు. ఇక అతడి పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు! సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి. పాలకులకి ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరు సమానులే. సీఎం చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్‌పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతడికి ఎక్కడుంటుంది! అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమ కట్టడం మొదట కూలగొట్టడం సముచితం.
Also Read: YS Jagan: రూ.కోటితో రంగంలోకి మాజీ సీఎం జగన్.. వైసీపీ నాయకుల నెల జీతంతో
గొప్ప మున్సిపల్ శాఖ మంత్రి అయిన పి నారాయణకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమంతా సహకరించాల్సి ఉంది. జలాశయాలు, సముద్రపు తీరం వెంట అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలనుకున్న ఆయన మొదట కృష్ణా నది సరిహద్దుపై అక్రమంగా చంద్రబాబు నాయుడు నిర్మించుకున్న ఇంటిని కూల్చేయాలి. చట్టం ఎవరికీ అతీతం కాదు. చివరకు చంద్రబాబుకు కూడా' అని విజయసాయి రెడ్డి తెలిపారు.
టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుంది. బాధ్యత తీసుకోవాలని ఇంకా గత ప్రభుత్వంలో ఉన్న వారిని కోరుతున్నారు. వారు భవిష్యత్ కంటే గతంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఏపీ ప్రజలకు మేలు చేసేందుకు వారికి కాఫీ ఇచ్చి నిద్రలేపాల్సిన అవసరం ఉంది' అంటూ ఎద్దేవా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.