CM Jagan Announces to Release Pending DA: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. జూలై-2022కు సంబంధించిన డీఏను దసరా పండుగ నాడు ఇస్తామని ప్రకటించారు. మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగులకు అదనంగా 5 క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు మంచి చేయడంలో నాలుగు అడుగులు ముందుంటుందని స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఏపీఎన్‌జీవోస్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) 21వ రాష్ట్ర మహా సభలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో తమది ప్రజా ప్రభుత్వం అని అన్నారు. తమకు, ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధులు అని.. వారి సంతోషం, భవిష్యత్తు ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా తాము అంతకంటే మిన్నగా ఉన్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలో ఒకటి దసరా కానుకగా అందిస్తామని ప్రకటించారు.
ఎప్పుడూ నిజాయితీ కమిట్‌మెంట్‌తోనే అడుగులు వేశామని అన్నారు సీఎం జగన్. పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు ఉద్యోగులను మభ్యపెట్టిందన్నారు. అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు పెంచింది తమ ప్రభుత్వమేనని.. కరోనా సమయంలో రెవెన్యూ తగ్గినా డీబీటీని అమలు చేశామన్నారు. గత ప్రభుత్వం గవర్నమెంట్ ఆసుపత్రులను నాశనం చేసిందని మండిపడ్డారు.
ప్రస్తుతం ఏడు నియోజకవర్గాలకు ఒక కలెక్టర్, ఒక ఎస్పీని నియమించామని.. గత ప్రభుత్వం పక్కన పడేసిన సమస్యలను పరిష్కరించామన్నారు. ప్రతీ చోటా దళారీ వ్యవస్థకు చెక్ పెట్టామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇచ్చిన ప్రభుత్వం మనదని.. నెల మొదటి వారంలోనే జీతాలు ఇస్తూ ఉద్యోగులకు అండగా నిలిచామన్నారు. కారుణ్య నియామాల్లోనూ పారదర్శకత పాటించామని.. 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు.
జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. మొక్కుబడిగా కొన్ని ఉద్యోగాలు విదిల్చారని.. బాబు, ఆయన వర్గానికి తన మీద కడుపు మంట అని విమర్శించారు. పుంగనూరులో పోలీసులపై దాడి చేశారని.. 47 మంది పోలీసులపై దాడికి పాల్పడ్డారని అన్నారు. ఒక పోలీసు కన్ను పోగొట్టారని చెప్పారు. ఉద్యోగుల్లో చంద్రబాబు ఏ వర్గాన్నీ పట్టించుకోలేదని.. ఆయన దృష్టిలో కొందరు మంచొళ్లు.. మిగిలిన వారంత లంచ గొండులని అన్నారు.
Also Read: Interest Rates Hike:ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. సేవింగ్ అకౌంట్స్ వడ్డీ రేట్లు పెంపు
Also Read: Onion Prices Today: ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 40 శాతం ఎగుమతి సుంకం విధింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook