Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. గత ఎన్నికల ప్రచారంలో వైసీపీని టార్గెట్ చేయడంలో భాగంగా వాలంటీర్లపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ముఖ్యంగా వాలంటీర్లు .. సమాజంలో అసాంఘిక శక్తులుగా మారారని పవన్ ఆరోపించారంటూ గతేడాది జూలై 29న గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు చేసారు. ఈ విషయమై గతంలోనే పవన్ కళ్యాణ్ హైకోర్టు ఆశ్రయించారు. తాజాగా ఈ ఘటనలో పవన్ పై తాము ఎలాంటి కంప్లైంట్ చేయలేదని వాలంటీర్లు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయమూర్తి ఆర్. శరత్ బాబు పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
జనసేనాని రీసెంట్ గా మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అభ్యర్ధుల తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో దక్షిణాది యోగి ఆదిత్యనాథ్ గా మారారు. ఆయన రూట్లోనే బీజేపీ నేతల కంటే హిందూత్వ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ మెజారిటీ హిందుత్వ వాదుల్లో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఆయన ఇమేజ్ చేరుకుంది. దీంతో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఏది ఏమైనా సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పవన్ జాతీయ నేతగా ఎదిగిపోయారు.
అంతేకాదు దక్షిణాది నుంచి జాతీయ నేతగా తమ కూటమి పార్టీల తరుపున ప్రచారం నిర్వహిస్తూ హల్ చల్ చేస్తున్నారు. రాబోయే ఢిల్లీ, బిహార్ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ను వాడుకోవాలని కేంద్రంలోని పెద్దలు భావిస్తున్నారు. మొత్తంగా ఏ నిమిషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పవన్ పేరు.. కాదు.. తుఫాను అని చెప్పారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగిపోతూనే ఉంది. ఏది ఏమైనా దక్షిణాది నుంచి అది కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఓ వ్యక్తి జాతీయ స్థాయి నేతగా ఎదగడం ఆహ్వానించదగ్గ పరిణామమే.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter