AP: అల్పపీడన ప్రభావం, భారీ వర్షసూచన

ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడ్రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Last Updated : Jul 29, 2020, 05:33 PM IST
AP: అల్పపీడన ప్రభావం, భారీ వర్షసూచన

ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) లో రానున్న మూడ్రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ( IMD ) తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులకు 5.8 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉందని తెలుస్తోంది. ఈ ఆవర్తనం ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపుకు ఉండటం కారణంగా పశ్చిమ విదర్బ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పిడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చు. మరి కొన్నిచోట్ల భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశాలున్నాయి. అల్పపీడన ప్రభావం మూడ్రోజుల పాటు ఉండవచ్చని తెలుస్తోంది.

Trending News