Ap Government: ఆ అధికారిపై ఎంత ప్రేమో...ఏకంగా కొత్త పదవిని సృష్టించిన సీఎం వైఎస్ జగన్

Ap Government: వడ్డించేవాడు మనవాడైతేనా అనే సామెత ఇక్కడ బాగా పనికొస్తుంది. ఎందుకంటే సమర్ధత ఒక్కటే సరిపోదు..విధేయత, అండదండలు కూడా అవసరం. అందుకే రిటైర్ అయినా కొత్త పదవి సిద్ధమైంది ఆయన కోసం. అసలేం జరిగింది...

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 29, 2022, 10:19 PM IST
Ap Government: ఆ అధికారిపై ఎంత ప్రేమో...ఏకంగా కొత్త పదవిని సృష్టించిన సీఎం వైఎస్ జగన్

ఇది జరిగింది ఏపీ ప్రస్తుతం ఛీప్ సెక్రటరీ సమీర్ శర్మ విషయంలో. రేపు అంటే నవంబర్ 30న పదవీ విరమణ చేయనున్న ఈయనకు మరో కొత్త పదవిని సిద్ధం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ముఖ్యమంత్రి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సమీర్ శర్మ నియమితులు కానున్నారు. 

ఏం జరిగిందంటే...

ప్రస్తుత ఏపీ ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ రేపు అంటే నవంబర్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయనపై నమ్మకమో..సామర్ధ్యమో..మరొకటో తెలియదు గానీ..మరోసారి ఆయనకు మరో గిఫ్ట్ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వాస్తవానికి సమీర్ శర్మ పదవీకాలం 2022 మేతోనే ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించారు. ఈసారి మళ్లీ పొడిగిద్దామని అనుకున్నా..కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో ఏకంగా కొత్త పదవి సృష్టించారు. ముఖ్యమంత్రి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పదవి సృష్టించి అందులో ఆయనను నియమించారు. ఎక్స్‌అఫీషియో ఛీఫ్ సెక్రటరీగా ఆయన డిసెంబర్ 1 నుంచి వ్యవహరించనున్నారు. 

రేపు పదవీ విరమణ చేయనున్న ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్‌కు కూడా ఆఫర్ ఇచ్చారు. వైఎసార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన విజయ్ కుమార్..జిల్లాల పునర్విభజనను సమర్ధవంతంగా పూర్తి చేశారనే పేరుంది. రేపు పదవీ విరమణ చేయనున్న విజయ్ కుమార్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్...స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా నియమించారు. ఈయన కూడా ఎక్స్‌అఫీషియో సెక్రటరీ హోదాలో ఉంటారు.

ఈ ఇద్దరు అధికారుల సమర్ధతను ప్రశ్నించలేం. ఎందుకంటే చాలా నిష్ణాతులు. తెలివైనవారు. ప్రభుత్వంలో కీలక సమస్యల్ని సమర్ధవంతంగా పరిష్కరించిన అనుభవముంది. అదే సమయంలో ఈ ఇద్దరి విధేయతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తించడం విశేషం. అందుకే రిటైర్ అయినా సరే మళ్లీ పదవులు దక్కాయి.

Also read: AP NEW CS: ఊహించిందే జరిగింది..ఏపీ కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News