CM Jaganmohan Reddy cancels srisailam visit: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( Y. S. Jaganmohan Reddy) శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నారు. శ్రీశైలం తెలంగాణ ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ( Srisailam Fire Accident ) దృష్ట్యా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాట్లు ఏపీ ( Andhra Pradesh ) అధికారులు శుక్రవారం వెల్లడించారు. శ్రీశైలంలోకి భారీగా వరదనీరు వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి శ్రీశైలం పర్యటించాల్సి ఉంది. Also read: Fire Accident: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం
ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఈ పర్యటనను సీఎం జగన్ రద్దు చేసికుని.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి.. ఎలాంటి సహాయం కావాలన్నా.. తెలంగాణకు అందిచాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ జెన్కో ప్లాంట్లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని.. లోపల చిక్కుకున్న9మంది ఉద్యోగులు సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షించారు. Also read: Kishan Reddy: శ్రీశైలంలో అగ్ని ప్రమాదంపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే!