ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు సూటి ప్రశ్నలు

ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు సూటి ప్రశ్నలు

Last Updated : May 6, 2019, 12:00 PM IST
ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు సూటి ప్రశ్నలు

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనడం దేనికి సంకేతమని చంద్రబాబు నిలదీశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జి సర్కార్‌ని కూలగొడతామని మోదీ బెదిరిస్తున్నారా అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. మోదీ ఇటీవల బెంగాల్ పర్యటనలో ఉండగా చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆదివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... గతంలో ఏ ప్రధాని అయినా ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారా అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘం, ఆర్బీఐ, సీబీఐ, ఈడీ వంటి జాతీయ సంస్థలపై గతంలో ఎప్పుడైనా ఈస్థాయిలో విమర్శలు వచ్చాయా ? అని చంద్రబాబు ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో ఏమీ పట్టించుకోని ప్రధానిని అదేమని ప్రశ్నించిన వారిపై ఎదురుదాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.  

ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా బీజేపి కక్ష సాధింపు వైఖరినే అవలంభిస్తోదని ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు... రాష్ట్ర విభజన చట్టంపై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక్క సమావేశం అయినా ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు.

Trending News