Ananthpur Car Accident: కారు అదుపు తప్పడంతో లారీ కిందకు వెళ్లి అందులో ప్రయాణించే ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగనమల నాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. కారు టైర్ పగలడంతో అదుపు తప్పి లారీ కిందకు వెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు.
అనంతపురం నుంచి కడప వైపుగా హైవేపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌గా వెళ్లివస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.మృతులంతా ఇన్కాన్ నగర కీర్తన వేడుకలు హాజరు అవ్వడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు వెంకన్న (35), ప్రసన్న (34), శ్రీధర్ (28), సంతోష్ (26), వెంకీ (24), షణ్ముఖ (30) గా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: దీపావళి రోజు శని దేవుడిని పూజిస్తే.. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న బాధలన్నీ మాయం..
అయితే, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగమే అని పోలీసులు నిర్ధారించారు. హైవేపై రోడ్డు యాక్సిడెంట్ జరగడంతో ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ క్లీయర్ చేసే పనులు చేపట్టారు
ఇదీ చదవండి: పల్లెటూరి స్టైల్‌లో కోడికూరను ఇలా చేస్తే.. నోట్లో ముక్క వేసుకోగానే ఆహా అంటారు..
అతివేగం ప్రాణం తీసింది. ఇప్పటికే ఎన్నోసార్లు ట్రాఫీక్ పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. వేగంగా వాహనాలను నడపకూడదు అని వేగం కన్నా ప్రాణం మిన్న కదా.. వారు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉన్నారు. అయినా కానీ, హైవేలలో వాహనాలు వేగం పుంజుకుంటున్నాయి. ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏటా ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ అనంతపురం కారు యాక్సిడెంట్‌లో కూడా ఇదే జరిగింది. కారును వేగంగా నడుపుతున్న సమయంలో హైవేపై కారు టైర్ పేలింది. దీంతో కారు అదుపు తప్ప ఎదురుగా వస్తున్న లారీని అతి వేగంతో ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇస్కాన్ భక్తులు ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కారు కూడా పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. సాధారణంగా హైవేపై వాహనాలు స్పీడ్‌గా దూసుకుపోతుంటాయి. ఈ సందర్భంలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
ఇదే కాదు మద్యం తాగి కూడా వాహనాలు నడుపుతుంటారు. దీనివల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఎప్పటిప్పుడు చెక్ చేస్తూ పెనాల్టీ విధిస్తూనే ఉన్నారు. అయినా ప్రమాదాలు ఆగడం లేదు. కొన్ని ప్రమాదాలు డ్రైవర్‌లు నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల కూడా జరుగుతుంది. వారు నిరంతరాయంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రలోకి జారుకుంటారు. ఏదేమైనా ఇలాంటి ప్రమాదాల వల్ల మృతుల కుటుంబాలు కూడా వీధిన పడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.