కొరియా తెగింపు చర్య, జపాన్ మీదుగా మరో మిస్సైల్ ప్రయోగం

Last Updated : Sep 18, 2017, 10:49 AM IST
కొరియా తెగింపు చర్య, జపాన్ మీదుగా మరో మిస్సైల్ ప్రయోగం

ఉత్తర కొరియా మరోసారి  తెగింపు చర్యకు పాల్పడింది. తాజా జపాన్ పై మరో మిస్సైల్‌ ప్రయోగించింది. ఈ మిస్సైల్ జపాన్ ఉత్త‌ర‌భాగంలోని హొకైడో మీదుగా వెళ్లి ప‌సిఫిక్‌లో ప‌డిన‌ట్లు ద‌క్షిణ కొరియా, జ‌పాన్ అధికారులు వెల్ల‌డించారు. జ‌పాన్‌ను స‌ముద్రంలో క‌లిపేస్తాం..అమెరికాను బూడిద చేస్తాం అన్న మ‌రుస‌టి రోజే ఉత్త‌ర కొరియా తెగించింది. జ‌పాన్ మీదుగా మ‌రో మిస్సైల్‌ను ప్రయోగించింది. ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి ప్రయోగించిన ఈ మిస్సైల్ గరిష్ఠంగా 770 కిమీటర్ల ఎత్తులో 3 వేల 700 కి.మీ దూరంలో ప్రయాణించిందని జపాన్ తెలిపింది. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసిన నేపథ్యంలో ఆవేశంలో ఊగిపోతున్న కొరియా ఇలాంటి తెగింపు చర్యలకు పాల్పడుతోంది. కాగా కొరియా చర్యలతో జపాన్ - ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతోందోనని ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల వారు ఆందోళన చెందుతున్నారు. 

Trending News