కరోనా వైరస్ ( Coronavirus ) వ్యాక్సిన్ విషయంలో వరుసగా శుభవార్తలు విన్పిస్తున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ ప్రకటన రేపిన ఉత్సాహం మరువక ముందే ఇప్పుడు మోడెర్నా మరో శుభవార్త విన్పించింది. 94 శాతం ప్రభావవంతంగా ఉందని మోడెర్నా కంపెనీ వెల్లడించింది.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్19 వైరస్ ( Covid 19 virus ) కు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం. ఇప్పుడీ వ్యాక్సిన్ ( Corona vaccine ) ఎంతోదూరంలో లేదు. దాదాపుగా అన్ని వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశలో ఉండగా..కొన్ని వ్యాక్సిన్ లు ఏడాది చివరికి అందుబాటులో రానున్నాయి. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ( Oxford-AstraZeneca vaccine ) డిసెంబర్ నాటికి అందుబాటులో రానుందని ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum institute ) ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అమెరికన్ కంపెనీ ఫైజర్ అభివృద్ధి చేసిన మరో వ్యాక్సిన్ కూడా డిసెంబర్ నాటికి మార్కెట్లో రానుందని తెలుస్తోంది. వ్యాక్సిన్ తుది పరీక్షల్లో 90 శాతం విజయవంతమైనట్టు ఫైజర్ ( Pfizer ) స్వయంగా ప్రకటించింది.
ఇప్పుడు అమెరికాకు చెందిన మరో కంపెనీ మోడెర్నా( Moderna company ) చేసిన ప్రకటన ప్రపంచదేశాలకు మరో శుభవార్తగా మారింది. తమ కరోనా వ్యాక్సిన్ 94.5 శాతం ప్రభావవంతంగా ఉందని మోడెర్నా కంపెనీ వెల్లడించింది. కోవ్ అని పిలుస్తున్నఈ వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ ప్రాథమిక దశ డేటా కచ్చితంగా గేమ్ ఛేంజర్‌గా నిలవనుందని వ్యాఖ్యానించింది. 95 మంది కరోనా బాధితులతోపాటు 30వేల మందిపై నిర్వహించిన వ్యాక్సిన్ ప్రయోగాల ఫలితాల ఆధారంగా మోడర్నా ఈ అంచనాను వెల్లడించింది. మూడవ దశ ప్రాథమిక ఫలితాల సామర్ధ్యాన్ని 94.5 శాతంగా అంచనా వేసింది. అత్యవసర వినియోగపు హక్కు కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయాలని కంపెనీ యోచిస్తోంది. మోడెర్నా చేసిన ప్రకటనతో అమెరికా షేర్ మర్కెట్ ( American share market ) మరోసారి లాభాల్ని ఆర్జించింది.
ఈ వ్యాక్సిన్ ను జనవరి నుంచి మార్కెట్ లో అందుబాటులో వచ్చే విధంగా సన్నాహాలు చేస్తోంది మోడెర్నా కంపెనీ. ఏదేమైనా రెండు ప్రముఖ కంపెనీల నుంచి వారం రోజుల వ్యవధిలో సానుకూల ప్రకటన రావడం స్వాగతించాల్సిన అంశమే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి
Also read: Donald trump tweet: చింత చచ్చినా..పులుపు చావని ట్రంప్, ఇంకా నేనే గెలిచానంటూ వ్యాఖ్యలు