France Covid Alert: కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అటు ఫ్రాన్స్‌లో కోవిడ్ కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కల్గిస్తోంది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఓ వైపు కోవిడ్ సాధారణ కేసులు, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర భయాందోళన రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఫ్రాన్స్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది. విలయ తాండవం అంటే ఏంటో చూపిస్తోంది. రోజుకు 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతూ పరిస్థితి ఘోరంగా మారుతోంది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి 10 మిలియన్లకు పైగా కేసులు నమోదైన దేశాల్లో ఫ్రాన్స్ ప్రపంచంలో ఆరవ స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌లో గత 24 గంటల్లో 2 లక్షల 19 వేల 126 కేసులు నమోదయ్యాయి. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవడం ఇవాళ తొలిసారి కాదు. వరుసగా నాలుగు రోజుల్నించి (France Coronavirus Update) ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మొత్తం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయని తెలుస్తోంది. బహుశా అందుకే సంక్రమణ వేగం పుంజుకుందనేది ఓ అంచనా.
కరోనా సంక్రమణ విషయంలో..10 మిలియన్లకు పైగా కేసులు నమోదైన అమెరికా, ఇండియా, బ్రెజిల్, బ్రిటన్, రష్యా దేశాల సరసన ఇప్పుడు ఫ్రాన్స్ చేరింది. ఫ్రాన్స్‌లో నిన్న అయితే గరిష్టంగా ఒక్కరోజులోనే 2 లక్షల 32 వేల కేసులు నమోదయ్యాయి. రానున్న కొద్ది వారాలపాటు పరిస్థితి ఇలాగే ప్రమాదకరంగా ఉండవచ్చని సాక్షాత్తూ ఫ్రాన్స్(France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ హెచ్చరించారు. ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేయదని..అయితే బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పారిస్, లియోన్ సహా ప్రధాన నగరాల్లో మాస్క్ ధారణ తప్పనిసరైంది.
Also read: Florona disease: కరోనానే కలవరపెడుతుంటే.. కొత్తగా 'ఫ్లొరోనా' వ్యాధి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook