Pakistan New Army Chief: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ మాజీ చీఫ్, లెప్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ (Asim Munir) నియమితులయ్యారు. గురువారం ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ జనరల్ కమర్ బజ్వా వారసుడిగా అసిమ్ పేరును ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా ఈ నెల 29న పదవి విరమణ చేయనున్నారు. 61 ఏళ్ల బజ్వా పదవీ కాలాన్ని ఇప్పటికే మూడు సంవత్సరాలు పొడిగించారు. ఈ క్రమంలో ఆర్మీ కొత్త బాస్ ఎంపిక ప్రక్రియను పాక్ చేపట్టింది. ఈ పదవి కోసం పలువురు పేర్లను పరిశీలించిన రక్షణ శాఖ చివరకు మునీర్ వైపే మెుగ్గు చూపింది.
మరోవైపు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాఎంపికయ్యారు. ఈమేరకు వీరిద్దరి పేర్లను పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి పంపారు. వీరి నియామకానికి అధ్యక్షుడు ఆమెదం తెలిపారు. పాకిస్తాన్ లో ప్రధాని, అధ్యక్షుడి కంటే కూడా ఆర్మీ చీఫ్ పదవే చాలా బలమైనది. స్థానిక, విదేశీ కార్యకలాపాల్లో అతడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. ప్రభుత్వం ఉన్నప్పటికీ విదేశాంగ, భద్రతా విధానాల్లో పాక్ ఆర్మీ చీఫ్ మాటే నెగ్గుతుంది. పాక్ గుడఛార సంస్థ ఐఎస్‌ఐకు గతంలో అధిపతిగా పనిచేశాడు మునీర్. ఇతడు కొత్త ఆర్మీ చీఫ్ బాధ్యతలు చేపట్టగానే పలు సవాళ్లు కూడా ఎదురుకానున్నాయి. ఇప్పటికే మాజీ ప్రధాని ఇమ్రాన్ పై దాడి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: US Shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. 10 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి