Copenhagen Shooting: డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగెన్లో కాల్పుల మోత మోగింది. ఆదివారం కోపెన్‌హగెన్‌లోని ఫీల్డ్స్ ప్రాంతంలోని రద్దీగా ఉండే ఓ షాపింగ్ మాల్‌లో సాయుధుడు జరిపిన కాల్పుల్లో (Copenhagen Shooting) ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో షాపింగ్ మాల్ వద్ద భయానక వాతావరణం నెలకొంది. కాల్పులు జరిగినప్పుడు.. కొందరు వ్యక్తులు దుకాణాలలో దాక్కుకోగా... మరికొందరు భయాందోళనలతో తొక్కిసలాటలో పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్కాండినేవియాలోని అతిపెద్ద షాపింగ్ మాల్స్‌లో ఇది ఒకటి.
సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతేకాకుండా అగ్నిమాపక యంత్రాలను కూడా రంగంలోకి దించారు. ఈ ఘటనలో 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. కోపెన్‌హాగన్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సోరెన్ థామస్సేన్ మాట్లాడుతూ.. దాడిలో మరెవరూ ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు పొడవాటి షార్ట్ ధరించి చేతిలో తుపాకీ కల్గి ఉన్నట్లు డానిష్ మీడియా వెల్లడించింది. ఈ ప్రాంతానికి సమీపంలో రాయల్ ఎరీనా ప్రాంతంలో ఓ ఫంక్షన్ జరగాల్సి ఉండగా దానిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. డెన్మార్క్‌లో తుపాకీ హింస చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.
Also Read: Pakistan Accident: పాకిస్థాన్‌లో మృత్యులోయ.. 19 మంది మృతి..11 మందికి గాయాలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook