Israeli PM with PM Modi: తమ పార్టీలో చేరండని మోదీని కోరిన ఇజ్రాయెల్‌ ప్రధాని

Israeli PM Bennett tells PM Modi : మోదీని తమ యామినా పార్టీలో చేరాలంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్‌ సరదాగా ఆహ్వానించారు. వీరిద్దరూ హైటెక్‌ పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలపై సహకారాన్ని విస్తరించుకోవడంపై చర్చలు జరిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 12:50 PM IST
  • మోదీకి ఇజ్రాయెల్‌లో మంచి ప్రజాదరణ ఉందంటూ మెచ్చుకున్న ఇజ్రాయెల్‌ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్‌
  • ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పడి వచ్చే ఏడాదితో 30 సంవత్సరాలు
  • భారత్‌కు రావాలంటూ బెన్నెట్‌ను ఆహ్వానించిన మోదీ
Israeli PM with PM Modi: తమ పార్టీలో చేరండని మోదీని కోరిన ఇజ్రాయెల్‌ ప్రధాని

Come join my party Israeli PM Bennett tells PM Modi, calls him 'most popular person' : భారత ప్రధాని నరేంద్ర మోదీకి (Prime Minister Narendra) ఇజ్రాయెల్‌లో మంచి ప్రజాదరణ ఉందంటూ మోదీని మెచ్చుకున్నారు ఇజ్రాయెల్‌ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్‌. అంతేకాదు..మోదీని తమ యామినా పార్టీలో చేరాలంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్‌ (Israel Prime Minister Naftali Bennett) సరదాగా ఆహ్వానించారు. వీరిద్దరూ హైటెక్‌ పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలపై సహకారాన్ని విస్తరించుకోవడంపై చర్చలు జరిపారు. 

ఇక ఇజ్రాయెల్‌తో (Israel) దౌత్య సంబంధాలు ఏర్పడి వచ్చే ఏడాదితో 30 సంవత్సరాలు అవుతుండడం వల్ల భారత్‌ కు (India) రావాలంటూ బెన్నెట్‌ను మోదీ ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య స్నేహాన్ని మోదీ బలోపేతం చేశారంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని పేర్కొన్నారు.

Also Read : COVID-19 Cases : అదుపులో ఉన్న కోవిడ్, 11,903 మందికి కోవిడ్ పాజిటివ్‌

ఇక ఇజ్రాయెల్‌ ప్రధానిగా (Israel Prime Minister) బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీతో బెన్నెట్‌ భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ భేటీలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్‌ (Naftali Bennett) చర్చించారు. ముఖ్యంగా అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యవసాయం, అంతరిక్షం, భద్రత విషయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. 

ఇండో-ఇజ్రాయెల్‌ (India-Israel) సంబంధాలను పునఃప్రారంభించడంపై ఇజ్రాయెల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌తో ఇంతకుముందు కొనసాగించినట్లుగానే భారత్‌ (India) తన సహకారాన్ని అందించాలని ఆకాంక్షించిన బెన్నెట్‌ (Bennett).. వివిధ రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తూ ముందుకు సాగాలని కోరారు.

Also Read : Puneeth Rajkumar: ఫ్యాన్స్​​ను కంటతడి పెట్టిస్తున్న పునీత్ లాస్ట్​ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News