Kash Patel: FBI ఛీఫ్ గా కాష్ పటేల్.. భారతీయ అమెరికన్ కు అత్యున్నత గౌరవం..

Kash Patel as FBI Chief: అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ FBI డైరెక్టర్‌గా ఇండియన్‌  అమెరికన్‌ కాశ్‌ పటేల్‌ నియామకాన్ని US సెనెట్‌ ఆమోదించింది. మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ తన టీమ్ లో భారతీయ అమెరికన్స్ కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 21, 2025, 02:57 PM IST
Kash Patel: FBI ఛీఫ్ గా కాష్ పటేల్.. భారతీయ అమెరికన్ కు అత్యున్నత గౌరవం..

Kash Patel as FBI Chief: అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఒక్కో వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటూ వెళుతున్నాడు. మొత్తంగా అమెరిక వ్యవస్థలో వేళ్లునుకుపోయినా.. డెమెక్రాట్స్ తోపాటు డీప్ స్టేట్ సభ్యులను ఒక్కొక్కరిని సాగనంపుతున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికాకు గుండె కాయ వంటి ఎఫ్ బీఐకు భారతీయ అమెరికన్ అయిన కాష్ పటేల్ ను నియమించారు.  ఈ నేపథ్యంలో కాశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.

FBI తొమ్మిదో డైరెక్టర్‌గా కాశ్‌ పటేల్‌ నియమితులయ్యారు. దీనిపై ఆయన ఎంతో సంతోషంగా వుందన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ , అటార్నీ జనరల్ పామ్‌ బోండికి కాశ్‌ పటేల్‌ ధన్యవాదలు తెలిపారు. FBI ఐకి ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు.  దేశ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు బ్యూరో కట్టుబడి ఉందన్నారు.  దేశం గర్వించే విధంగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తామన్నారు కాశ్‌ పటేల్‌. అమెరికన్లకు ఎవరైనా హాని చేయాలని చూస్తే.. వారి అంతు చూస్తామన్నారు.  ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్‌ పేరును అలస్కాకు చెందిన రిపబ్లికన్‌తో పాటు పలువురు డెమోక్రట్లు వ్యతిరేకించారు. అయితే 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకం జరిగింది. దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి హిందూ, భారతీయ‌ అమెరికన్‌గా కాశ్‌పటేల్‌ నిలిచారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు వీర విధేయుడిగా పేరు పడ్డారు కాశ్‌పటేల్‌.  ఆయన  కుటుంబ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నియంత ఈదీ ఆమిన్‌ బెదిరింపుల కారణంగా అతడి తండ్రి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లోని గార్డెన్‌ సిటీలో పటేల్‌ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్‌ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్.. యూనివర్శిటీ కాలేజ్‌ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. కాశ్‌ పటేల్‌ మియామీ కోర్టుల్లో పబ్లిక్‌ డిఫెండర్‌గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు.

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News