తెలంగాణలో పోలీస్ స్టేషన్లను అధునాతన సౌకర్యాలతో మోడల్ పోలీస్ స్టేషన్లుగా మార్చాలన్న యోచన మంచి ఫలితాలనే ఇస్తోంది. దాదాపు రాష్ట్రంలోని 700 పోలీస్ స్టేషన్లను ఆధునీకరించాలని భావించిన ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. తొలివిడతలో అలా ఏర్పడిన పలు స్టేషన్లు సాఫ్ట్వేర్ కంపెనీలనే తలదన్నే విధంగాఉండడం గమనార్హం. అందుకు ఉదాహరణే పంజాగుట్ట పోలీస్ స్టేషన్. చూడడానికి ఏ మల్టీ నేషనల్ బ్యాంకో లేదా మినీ సాఫ్ట్వేర్ సంస్థో అనే భావన అయితే దానిని చూసిన వారెవరికైనా కలగక మానదు. అయితే ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్లనే ఈ విధంగా మార్చాలంటే దాదాపు రూ.20 లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుందనేది మార్కెట్ అంచనా. ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు రిసెప్షన్, ప్రత్యేక క్యాబిన్లు, మీటింగ్ రూమ్ లాంటివి ఉండడం ఈ స్టేషన్లలో ప్రత్యేకత.