Police Attack On Zee Telugu: తెలంగాణ పోలీసులు రెచ్చిపోతున్నారు. నిరుద్యోగుల ఉద్యమం.. పోరాటాన్ని ప్రసారం చేయడానికి వెళ్లిన రిపోర్టర్లపై పోలీసులు దురుసు ప్రవర్తన చేస్తున్నారు. డీఎస్సీ పరీక్షల వాయిదాపై పోరాటం చేస్తున్న ఉద్యమాన్ని.. నిరసన కార్యక్రమాలు కవరేజ్ చేయడానికి వెళ్లిన ప్రధాన మీడియాపై దాడి చేస్తున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ఉల్లంఘిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియాపై అణచివేత చర్యలు పాల్పడుతున్నారు. తాజాగా జీ మీడియాను లక్ష్యంగా పోలీసులు రెచ్చిపోయారు.
Also Read: DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ వద్ద నిరుద్యోగుల ఆందోళనను జీ తెలుగు న్యూస్ మీడియా రిపోర్టర్ చరణ్‌పై అమానుషంగా ప్రవర్తించారు. గల్లా పట్టుకుని.. నెట్టుకుంటూ తీసుకుని పోలీస్ వాహనంలోకి నెట్టేశారు. మీడియా అని చెబుతున్నా కూడా వినిపించుకోకుండా ఓయూ పోలీస్ స్టేషన్ సీఐ రాజేందర్ దారుణంగా వ్యవహరించారు. చేతిలో మైక్ పట్టుకుని కనిపిస్తున్నా కూడా పోలీసులు కర్కశంగా వ్యవహరించారు.
Also Read: DSC Aspirants: తెలంగాణ నిరుద్యోగులు సంచలనం.. డీఎస్సీ వాయిదాకు అర్ధరాత్రి ఉద్యమం
అనంతరం జీ తెలుగు మీడియా న్యూస్ కెమెరామెన్‌ను ఈ దాడి దృశ్యాలను డిలీట్ చేయాలని పోలీసులు ఒత్తిడి చేశారు. అంతేకాకుండా డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్న వీడియోలు కెమెరాలో నుంచి తొలగించాలని పట్టుబట్టారు. జీ తెలుగు న్యూస్ మీడియా సిబ్బంది నిరాకరించడంతో రిపోర్టర్ శ్రీచరణ్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ సీఐ, ఇతర పోలీసులతో జర్నలిస్టు శ్రీచరణ్ వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును ఖండించారు. ఐడీ కార్డు చూపిస్తున్నా వినిపించుకోకుండా దారుణంగా వ్యవహరించారు.
అయితే జీ తెలుగు న్యూస్ చానల్ రిపోర్టర్ శ్రీచరణ్‌పై పోలీసుల వ్యవహారాన్ని సంఘాలతోపాటు రాజకీయ, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మొన్న విద్యాశాఖ కార్యాలయం ముట్టడి సమయంలో కూడా మీడియాపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పలు మీడియా చానళ్లపై ఇదే తీరున పోలీసులు ప్రవర్తించారు. ఫ్రెండ్లీ పోలీస్ అని చెబుతున్న పోలీసులు మీడియాపైనే దాడులకు పాల్పడడం దారుణంగా కనిపిస్తోంది.
నిరుద్యోగులకు అండగా జీ తెలుగు న్యూస్
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. డీఎస్సీ వాయిదా, పోస్టుల సంఖ్య పెంచాలని ఉదృతంగా పోరాటం చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు అండగా జీ తెలుగు నిలుస్తోంది. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్‌కు అండగా నిలుస్తున్న జీ తెలుగుపై పోలీసులు ఒక ప్రణాళికగా దాడి చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగులకు అండగా నిలిచిన జీ మీడియా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter