Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ నానాటికి పెరిగిపోతుంది. రోజువారి కొవిడ్ కేసులు భారీగా నమోదయ్యాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 3,603 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ధాటికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి మరో 2,707 మంది బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 32,094 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 93,397 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 3,603 కేసులు వెలుగుచూశాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 1,421 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ పట్ల ప్రజలు అలసత్వం ప్రదర్శించవద్దని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.23.01.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/gUtz0ZlNVX— IPRDepartment (@IPRTelangana) January 23, 2022
ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Corona in Telangana: రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు- 31వేలపైకి యాక్టివ్ కేసులు
Also Read: మినిస్టర్ సార్.. నా ఆత్మహత్యకు అనుమతినివ్వండి.. కేటీఆర్‌కు యువ రైతు లేఖ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి