CM Kcr: ఈడీకి దొంగలు భయపడతారు..నేను ఎందుకు భయపడతా..సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్..!

CM Kcr: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈక్రమంలో టీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించింది.

Written by - Alla Swamy | Last Updated : Aug 20, 2022, 05:22 PM IST
  • తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్
  • బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
  • బీజేపీపై సీఎం కేసీఆర్ ఫైర్
CM Kcr: ఈడీకి దొంగలు భయపడతారు..నేను ఎందుకు భయపడతా..సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్..!

CM Kcr: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోమారు సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మునుగోడుల ఉప ఎన్నిక రావాల్సిన అవసరం ఏముందని ఫైర్ అయ్యారు. మరో ఏడాది ఎన్నికలు వస్తున్న సమయంలో ఉప ఎన్నికల ఎందుకని ప్రశ్నించారు. ఎవరి కోసం బైపోల్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ఇచ్చిందని..ఇది శుభపరిణామం అని అన్నారు.

మునుగోడు నుంచి ఢిల్లీ దాకా కామ్రేడ్లతో ఐక్యత ఉండాలని ఆకాంక్షించారు. నీటి గురించి ఢిల్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అడగరని విమర్శించారు సీఎం కేసీఆర్. కృష్ణా జలాలపై బీజేపీ పాలసీ ఏంటో కేంద్రమంత్రి అమిత్ షా చెప్పాలని డిమాండ్ శారు. ఈడీకి దొంగలు భయపడతారు..తాను ఎందుకు భయపడతానని మండిపడ్డారు. బీజేపీ నేతలు గోకినా గోకకపోయినా..తాను గోకుతూనే ఉంటానని స్పష్టం చేశారు.

ఈడీ, బోడీలకు తాను భయపడనని..ఏం పీక్కుంటావో పీక్కో అంటూ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలకు ఎందుకంత అహంకారమని ప్రశ్నించారు. బెంగాల్‌లో మమత సర్కార్ను పడగొడతామని అంటున్నారని గుర్తు చేశారు. అందం కలిసి బీజేపీకే మీటర్ పెడదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది వేస్ట్ అయిపోతుందని..దీనిపై మరోమారు ఆలోచించుకోవాలన్నారు సీఎం కేసీఆర్. 

ఇది ప్రజాస్వామ్యామా..అహంకారమా..లేక బలుపా..అధికార మదంతోనే కళ్లూ మూసుకుపోయాయని బీజేపీపై ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో టీఆర్ఎస్ జోరు పెంచింది. అదికాక రేపు మునుగోడులో కేంద్రమంత్రి అమిత్ షా బహిరంగసభ జరగనుంది. ఈసభ ద్వారా సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమలం గూటికి చేరునున్నారు. సభకు అన్ని ఏర్పాట్లు పూర్తైయ్యాయి. దీంతో బీజేపీ సభకు కౌంటర్‌గా ఇవాళ సీఎం కేసీఆర్ ప్రజా దీవెన సభ ఏర్పాటు చేశారు.

Also read:Rahul Gandhi: కాంగ్రెస్‌లో కథ మొదటికి..తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ..!

Also read:KCR Munugode Meeting: ఈడీ, బోడీలకు పెట్టుకో..ఏం పీక్కుంటావో పీక్కో..మోదీపై కేసీఆర్ ధ్వజం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News