Telangana: రాష్ట్రంలో 5 వేల అంగన్ వాడీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

Telangana: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5వేల అంగన్ వాడీ పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 11, 2022, 10:50 PM IST
Telangana: రాష్ట్రంలో 5 వేల అంగన్ వాడీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

Telangana: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5వేల అంగన్ వాడీ పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం.

తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి అదనంగా పది లక్షల పెన్షన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. మొత్తం 46 లక్షల పెన్షన్‌దారులకు కార్డులు జారీ చేయనుంది. 

మరోవైపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5 వేల 111 అంగన్ వాడి టీచర్లు, ఆయా పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ తెలిపింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన జరగనున్న శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాల్ని రద్దు చేసింది కేబినెట్. పెళ్లిళ్లు, శుభ కార్యాలకు శ్రావణమాసంలో అదే చివరిరోజు కావడంతో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైప రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని నిర్ణయించింది. 

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కేబినెట్‌లో సమగ్రంగా చర్చ జరిగింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయంలో 15.3 శాతం వృద్ధి నమోదైనట్టు తెలంగాణ కేబినెట్ భేటీలో అధికారులు తెలిపారు. హైదరాబాద్ కోఠి వైద్య ఆరోగ్య శాఖ సముదాయంలో ఓ అధునాతన ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేబినెట్ తీర్మానించింది. 

Also read: Telangana: రాష్ట్రంలో తొలి కేజీ టు పీజీ విద్యాలయం సిద్ధం, ఆధునిక వసతులతో త్వరలో ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News