SLBC: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వద్ద టన్నెల్ కూలిన ప్రదేశం మొత్తం బురదతో నిండిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. టన్నెల్ లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో లోపలికి వెళ్లడానికి రెస్క్యూ సిబ్బందికి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టన్నెల్ కూలిన ప్రాంతానికి నేరుగా వెళ్లడానికి కొండపై నుంచి సొరంగం తీసే యోచన కూడా చేస్తున్నారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు నిరంతరం సహాయకచర్యలకు పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు మంత్రులు టన్నెల్ లోపలికి వెళి కూడా పరిశీలించారు. అయితే టన్నెల్ 12వ కిలోమీటర్ వరకు మాత్రమే రెస్క్యూ సిబ్బంది వెళ్లగలుగుతున్నారు. అక్కడి మరో రెండు కిలోమీటర్ల దూరంలో 8 మంది కార్మికులు ఉన్నారని భావిస్తున్నారు. ఆ రెండు కిలోమీటర్లు మొత్తం నీరు, బురదతో నిండిపోయింది. దీంతో నీటిని బయటికి పంపించాకే సహాయచర్యలకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
8 మంది కార్మికుల ప్రాణాలు రక్షించడానికి పైనుండి, సైడ్ నుండి డ్రిల్లింగ్ చేయాలని చూస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం తీసుకుంటామన్నారు. నేవీ సిబ్బందిని తీసుకువస్తున్నామని చెప్పారు. టన్నెల్ లో బురద,నీరు ఉండడంతో కొంత ఆటంకాలు కలుగుతున్నాయన్నారు. మరోవైపు హై టెక్నాలజీ మిషనరీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.