Bidar Robbery Gang: అక్కడ చోరి.. ఇక్కడ ఫైరింగ్.. హైదరాబాద్ లో కాల్పుల కలకలం..

Hyd Robbery Gang: బీదర్ లో  భారతీయ స్టేట్ బ్యాంక్ ఏటీమ్  దోపిడి చేసిన దొంగల ముఠా.. ఆ తర్వాత పోలీసుల కన్నుగప్పి హైదరాబాద్ పారిపోయి వచ్చారు. వీరిని పట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చిన బీదర్ పోలీసులపై దుండుగులు కాల్పుల జరపడం చర్చనీయాంశంగా మారింది.    

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 17, 2025, 01:54 PM IST
Bidar Robbery Gang: అక్కడ చోరి.. ఇక్కడ ఫైరింగ్.. హైదరాబాద్ లో కాల్పుల కలకలం..

Hyd Robbery Gang: కర్ణాటక రాష్ట్రం బీదర్ లో  ఎస్బీఐ ఏటీఎం దోపిడి ఘటన తర్వాత దొంగలు కర్ణాటక పోలీసుల కళ్లు గప్పి హైదరాబాద్ పారిపోయి వచ్చారు.  బీదర్ లో ఏటీమ్ దోపిడి చేసిన ముఠా హైదరాబాద్ చేరుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చిన బీదర్ పోలీసులపై దొంగల ముఠా కాల్పులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.  హైదరాబాద్ నడిబొడ్డు అఫ్జల్ గంజ్ ఈ ఘటన చోటు చేసుకుంది. బీదర్ లో ఏటీఎం కొల్లగొట్టిన తర్వాత దుండగులు ఆ తర్వాత హైదరాబాద్ పారిపోయారు. అయితే.. దొంగతనం జరిగే సమయంలో అక్కడ ఉన్న ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు హైదరాబాద్ పారిపోయినట్టు కనుగొన్నారు బీదర్ పోలీసులు. కాల్పుల కేసు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు  చేపట్టారు. అంతేకాదు బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చిన వారి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు అఫ్జల్ గంజ్ లో ఉన్నట్టు కనుగొన్నారు.  

ఈనేపథ్యంలో అఫ్జల్‌గంజ్‌ పోలీసులతో కలిసి నిందితులను పట్టుకునే క్రమంలో కాల్పలు ఘటన చోటు చేసుకుంది. అంతేకాదు పోలీసులపై కాల్పలు జరిపిన తర్వాత వారు అక్కడ నుంచి తప్పించుకున్నారు. దీంతో   బీదర్‌ నిందితుల కోసం హైదరాబాద్‌ సిటీ మొత్తం అలర్ట్ ప్రకటించినట్లు ఈస్ట్‌ జోన్‌ డీసీపీ బాలస్వామి తెలిపారు. నిందితులను పట్టుకునేందకు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసారు. 4 బృందాలు ఏర్పడి గాలిస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టారు. బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. లాడ్జీలతో పాటు పరిసర ప్రాంతాల్లో క్షుణంగా సోదాలు చేస్తున్నారు పోలీసులు.

దొంగల ముఠాను పట్టుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చిన బీదర్ పోలీసులను చూసి దుండగులు కాల్పులు జరిపారు. దుండగులు బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు.  దుండగుల కాల్పుల్లో ట్రావెల్స్ బస్ క్లీనర్‌కు గాయాలయ్యాయి. దుండగులు పోలీసుల నుంచి తప్పించుకొని ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అఫ్జల్‌గంజ్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News