rythu bandhu scheme june 2021 installment money to be credited in farmers' bank accounts : హైదరాబాద్: రైతు బంధు సాయం జూన్ ఇన్స్టాల్మెంట్ విడుదలకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. జూన్ 15 నుంచి 25వ తేదీలోగా రైతులకు రైతు బంధు సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి కోసం ప్రతీ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఎప్పటిలాగే ఈసారి కూడా రైతుల ఖాతాల్లో జమచేయాలని (rythu bandhu scheme money will be deposited in farmers bank accounts) సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. జూన్ 10 వ తేదీని కటాఫ్ తేదీగా పెట్టుకోని, ఆ తేదీ వరకూ రెవిన్యూ రికార్డుల పరంగా పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలోకి మారిన భూములకు రైతు బంధు వర్తింపచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.
మళ్లీ పంటలు వేసే సీజన్ కానుండంతో రైతులు కల్తీ విత్తనాలు (Fake seeds) నమ్మి మోసపోకుండా నాణ్యమైన విత్తనాలు మాత్రమే మార్కెట్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. కల్తీ విత్తనాల తయారీదారులు, విక్రయదారులపై పీడీ యాక్టు (PD Act) కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేసి కల్తీ విత్తనాల విక్రయ ముఠాలను పట్టుకునే పోలీసు అధికారులకు ప్రమోషన్లు, రివార్డులు, సేవా పతకం కూడా అందించి వారిని మరింత ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
Also read : Gurukulam entrance test: గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు వాయిదా
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రంగంలోకి దిగిన డీజీపీ మహేందర్ రెడ్డి.. నకిలీ విత్తనాలు విక్రయించి రైతుల నష్టానికి కారకులయ్యే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు (Nakili vithanalu) అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఐజీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను అరికట్టడంలో వ్యవసాయ శాఖతో కలిసి పని చేయాలని అధికారులకు సూచించారు. చిత్తశుద్ధితో పనిచేసి నకిలీ విత్తనాలు అరికట్టేందుకు కృషి చేసే పోలీసులకు తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి సత్కరించనున్నట్టు డీజీపీ (DGP Mahender Reddy) తెలిపారు.
Also read : షోకాజ్ నోటీసులు అందుకున్న private hospitals జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook