Telangana Crop Loan Waiver: ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్ష రుణమాఫీని అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. అయితే రుణమాఫీ పథకం అమలును ముందుకు జరిపి రేవంత్ రెడ్డి సంచలనం రేపారు. రుణమాఫీలో మొదట రూ.లక్ష మాఫీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆగస్టు 15 కాకుండా జూలై 18వ తేదీనే రుణమాఫీ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రుణమాఫీ అమలుపై ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించింది.
Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే... ఈడీ నుంచి రక్షణ కోసమేనా?
ఈ నెల 18వ తదీన లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రోజు సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో మాఫీ డబ్బులు జమ చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ చేసే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని సూచించారు. అయితే రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లను ప్రభుత్వం హెచ్చరించింది.
Also Read: Police Lathi Charge: రాత్రిపూట నిరుద్యోగులపై విరిగిన పోలీస్ లాఠీ.. చిక్కడపల్లి లైబ్రరీ దిగ్బంధం
మార్గదర్శకాలపై స్పష్టత
రుణమాఫీ మార్గదర్శకాలపై తీవ్ర దుమారం ఏర్పడడంతో రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. రేషన్ కార్డు ఉన్న రైతులకే రుణమాఫీ అని నిబంధనల్లో ఉండడంపై స్పందించారు. భూమి పాస్ పుస్తకం ఆధారంగానే కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీ ఇస్తామని తెలిపారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు వివరించారు. ఈ మేరకు కలెక్టర్ల సదస్సులో అధికారులతో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
మరింత గందరగోళం
అయితే రేవంత్ ఇచ్చిన స్పష్టతతో మరింత గందరగోళం ఏర్పడింది. పాసు పుస్తకం ఆధారంగానే రుణమాఫీ చేస్తానని చెబుతూనే రైతును గుర్తించేందుకు రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పడం వెనుక అంతరార్థం ఏమిటో అర్థం కాలేదు. ఎలా చూసినా రుణమాఫీకి అర్హత సాధించాలంటే కచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే కదా? అని రైతులతోపాటు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం అని ఉన్న నిబంధనకు రేవంత్ కొత్త నిర్వచనం చెప్పాడు తప్పా రేషన్ కార్డు లేకుంటే రుణమాఫీ కానట్టే అని స్పష్టంగా తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి