'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి మరోసారి బ్రేక్ పడింది. ఏపీలో రేపు విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్ కు ఈసీ నుంచి మరో షాక్ తగలింది. తమ అనుమతి లేకుండా చిత్ర ఎలా రిలీజ్ చేస్తారని ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. విడుదల తేదీ ఏకపక్షంగా నిర్ణయమని..ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మే 23 వరకు చిత్రం రిలీజ్ చేయడం కుదరని తేల్చి చెప్పింది.
ఈ సందర్బంగా ఈ మూవీ విషయంలో గత జీవో ను ప్రస్తావించింది. ఏప్రిల్ 10న వెలువరించిన ఆ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నామని. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ మూవీ విడుదలకు అనుమతి లేదని పేర్కొంది. ఈ క్రమంలో తమ ఆదేశాలకు సంబంధించిన ప్రతిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపింది. సినిమా థియేటర్లలో చిత్ర ప్రదర్శనకు అనుమతి ఇవ్వరాదని ఆదేశించింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసేలా బయోపిక్‌లు ఉండకూడదని భావించిన ఎన్నికల సంఘం లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదల రిలీజ్ చేయకూడదని ఏప్రిల్ 10న ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ మే 23వ వరకు అమల్లో ఉన్నందున ..అప్పటి వరకు ఈ సినిమాను విడుదల చేయకూడదు. మే 1న సినిమా విడుదలకు నిర్మాతలు తీసుకున్న నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.