Rajalinga Murthy Murder Case: తెలంగాణలో ఓ హత్య రాజకీయంగా తీవ్ర సంచలనం రేపగా తాజాగా ఆ హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో కలకలం రేపగా.. ఈ సంఘటనకు ఎలాంటి రాజకీయ కోణం లేదని నిరూపితమైంది. రాజకీయ కక్షతో హత్య జరగలేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ హత్య భూ వివాదం కారణంగానే జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
Also Read: Free Bus: మహా శివరాత్రి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ఉందా?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెడ్డి కాలనీలో రాజలింగ మూర్తి ఇటీవల హత్యకు గురయిన విషయం తెలిసిందే. కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ కూలడంపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై న్యాయస్థానంలో రాజ లింగమూర్తి సవాల్ చేశారు. అయితే కేసులో కోర్టు ఒకసారి అనుకూలంగా.. మరోసారి ప్రతికూల ఫలితం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురవడం రాజకీయంగా తీవ్ర సంచలనం రేపింది. కోర్టులో కేసు వేసిన కారణంగానే హత్యకు గురయ్యాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఆరోపించారు.
Also Read: Bird Flu Case: తెలంగాణలో హై అలర్ట్.. తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు
బీఆర్ఎస్ పార్టీ నాయకులు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శలు చేశారు. ఇది వాస్తవం కాదని బీఆర్ఎస్ పార్టీ ఖండించినా కూడా రాజకీయంగా చిచ్చు రేపింది. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూవివాదం వల్లే హత్య జరిగినట్లు పోలీసుల నిర్దారణ చేశారు. ఈ కేసులో ఏడుగురు అరెస్ట్ కాగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే కేసు వివరాలు వెల్లడించారు.
హత్య కేసులో రేణికుంట్ల సంజీవ్, పింగిలి సీమంత్, మోరె కుమార్, కొత్తూరి కిరణ్, రేణికుంట్ల కొమురయ్య, దాసరి కృష్ణ, రేణిగుంట్ల సాంబయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్త హరిబాబు, పుల్ల నరేష్, పుల్ల సురేష్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 రాడ్లు, 5 బైక్‌లు, 7 సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు కలిసి హత్య చేయగా.. ఇద్దరు రెక్కీలో పాల్గొన్నారు. హత్యతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని ఎస్పీ కిరణ్ ఖారే వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.