Hyderabad: నారాయణ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం.. కాలేజీలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థి

Narayana College Student Suicide Attempt: హైదరాబాద్‌లోని అంబర్‌పేట నారాయణ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. యాజమాన్యం టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నందువల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని స్నేహితులు చెబుతున్నారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 19, 2022, 04:31 PM IST
  • హైదరాబాద్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
  • ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థి
  • తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలింపు
Hyderabad: నారాయణ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం.. కాలేజీలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థి

Narayana College Student Suicide Attempt: హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఉన్న నారాయణ కాలేజీలో శుక్రవారం (ఆగస్టు 19) ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీసీ నిమిత్తం కాలేజీ ప్రిన్సిపల్‌తో మాట్లాడేందుకు వచ్చిన ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రిన్సిపల్ గదిలో ఆయన ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థి ఆత్మహత్యను అడ్డుకునే క్రమంలో ప్రిన్సిపల్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో ప్రిన్సిపల్ గదిలోని ఏసీ, ఫర్నీచర్ కూడా ధ్వంసమయ్యాయి. నారాయణ కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థికి టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నందువల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితుడి స్నేహితులు చెబుతున్నారు.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం గురించి తెలిసి పలు విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు కాలేజీ భవనంపై రాళ్లు రువ్వగా అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాలేజీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

కాగా, ప్రైవేట్ కాలేజీల్లో అధిక ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారాయని, ఫీజుల పేరుతో యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  యాజమాన్యాల తీరుతో విద్యార్థులు మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ప్రభుత్వం ఇకనైనా ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: Munugode Bypoll: మునుగోడు బీజేపీలో ముసలం.. ఈటల రాజేందర్ పై గొంగిడి టీమ్ ఆగ్రహం

Also Read: CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు..  మంచి పనులు బీజేపీ నచ్చవన్న కేజ్రీవాల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News