Prakash Raj On Rahul: రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ నింపింది. అదే సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. రాహుల్ గాంధీ తమపై చేసిన ఆరోపణలకు కారు పార్టీ నేతలు కౌంటరిస్తున్నారు. రాహుల్ గాంధీని బఫూన్ గా అభివర్ణించారు మంత్రి కేటీఆర్. అయితే కాంగ్రెస్ , గులాబీ నేతల మధ్య సాగుతున్న వార్ లో సినీ హీరో ప్రకాష్ రాజ్ ఎంటరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టార్గెట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పీసీసీ నేతలు.
తెలంగాణ పర్యటనకు సంబంధించి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేశారు. రాహుల్ ట్వీట్ కు కౌంటరిచ్చారు ప్రకాశ్ రాజ్. రాహుల్ గారు.. తెలంగాణలో ఓ విజనరీ ఉన్న నేత నడిపిస్తున్నారు... మీ దగ్గర ఉన్న ఫూల్స్ తో మీరు ఏం ఆఫర్ చేస్తున్నారని తన ట్వీట్ లో ప్రకాశ్ రాజ్ విమర్శించారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది. ప్రకాష్ రాజ్ పై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు తెలంగాణ పీసీసీ నేతలు. ప్రకాష్ రాజ్ కు సినిమాలు లేక గ్లామర్ అవుటైందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఏది పడితే అది అనేయడం సినిమా వాళ్లకు తమాషా అయిపోయిందని జగ్గారెడ్డి కౌంటరిచ్చారు. టీపీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రకాష్ రాజ్ కు కౌంటరిచ్చారు. ప్రకాష్ రాజ్ ను బఫూన్ గా చెప్పారు ఉత్తమ్. ఆయన ఎంత మొనగాడైతే.. మా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ఉత్తమ్ ప్రశ్నించారు. రాజ్యసభ సీటు కోసమే కేసీఆర్ మెప్పు కోసం ప్రకాష్ రాజ్ వేషాలు వేస్తున్నారని విమర్శించారు.
ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటున్నారు ప్రకాష్ రాజ్. కేసీఆర్ తన మహారాష్ట్ర, కర్ణాటక పర్యటనకు ప్రకాష్ రాజ్ ను వెంట తీసుకెళ్లారు. దీంతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ కీలకంగా ఉండబోతున్నారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో ఒక రాజ్యసభ సీటు ఖాళీగా ఉంది. రెండు రోజుల క్రితమే ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. అయితే టీఆర్ఎస్ గెలుచుకునే పెద్దల సభ సీటును ప్రకాష్ రాజ్ కు ఇస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ పర్యటనపై ప్రకాష్ రాజ్ స్పందించడం వివాదాస్పమైంది. రాజ్యసభ సీటు కోసమే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని పీసీసీ నేతలు మండిపడుతున్నారు.
READ ALSO: Tsrtc Cuts Driver Salary : మైలేజీ తగ్గిందని డ్రైవర్ జీతంలో కోత.. ఆర్టీసీ వింత పోకడ
Sidda Ramaiah Join Bjp Soon: బీజేపీ గూటికి సిద్ధరామయ్య.. కర్ణాటకలో కాంగ్రెస్ కు బిగ్ షాక్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook