తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు కొత్త పల్లవి పాడుతున్నారు..ఎన్నికలయ్యాక జాతీయ పార్టీ చేస్తారట...ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ స్థాపించడంలో ఉపయోగం ఏంటో అర్థంకావడం లేదంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవ చేశారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే జాతీయ స్థాయిలో ఏదో చేస్తామని కేసీఆర్ కొత్త రాగం అందుకున్నారు. ప్రస్తుతం ఫిరాయించిన వారితో కలిపి టీఆర్ఎస్ పార్టీకి 15 మంది ఎంపీల బలం ఉంది..ఈ ఎంపీలతో 60 నెలల పాటు ఉన్న కేసీఆర్..ఏం సాధించారో చెప్పుకుండా..ఇప్పుడు ఏదో సాధిస్తామని ప్రజలకు మాయమాటలు చెబుతున్నారు ఎద్దేవ చేశారు
కోదండరాం మద్దతు కోరిన రేవంత్
సార్వత్రిక ఎన్నికల్లో మాల్కాజ్ గిరి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి ..టీజేఎస్ చీఫ్ కోదండరాంను కలిసి ఆ పార్టీ మద్దతు కోరారు. ఇదే సందర్భంగా కోదండరాం వద్ద నుంచి రేవంత్ రెడ్డి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు ఐటీఐఆర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.