హైదరాబాద్: ఓటర్ల జాబితా వివాదంపై ఎన్నికల సంఘం హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఓటరు నమోదు, సవరణ అనేవి నిరంతర ప్రక్రియ అని దీనికి గడువు నిర్దేశించలేమని ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. దీనిపై స్పందించిన ప్రతివాది తరపు న్యాయవాది తాము మరిన్ని వివరాలు సమర్పించేందుకు హైకోర్టును గడువు కోరారు. దీంతో న్యాయస్థానం విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది . దీంతో ఓటర్ల జాబితా అవకతవకలపై విచారణ బుధవారం మళ్లీ విచారణకు రానుంది.
ఎన్నికల జబితాలో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ ను కోరింది. దీనిపై స్పందించిన ఈసీ ఈ మేరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.