Telangana COVID-19 updates: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులపై లేటెస్ట్ అప్‌డేట్స్

Corona Cases in Telangana: తెలంగాణలో గురువారం కొత్తగా 731 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో కరోనావైరస్ కారణంగా నలుగురు మృతి చెందినట్టు తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 993 మంది కరోనావైరస్ నుండి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2021, 08:15 AM IST
Telangana COVID-19 updates: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులపై లేటెస్ట్ అప్‌డేట్స్

Corona Cases in Telangana: తెలంగాణలో గురువారం కొత్తగా 731 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో కరోనావైరస్ కారణంగా నలుగురు మృతి చెందినట్టు తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 993 మంది కరోనావైరస్ నుండి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,29,785 కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనావైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 3,714 కి పెరిగింది.  

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11,206 కరోనావైరస్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ స్పష్టంచేసింది. కరోనావైరస్ తగ్గుముఖం పట్టి, డెల్టా ప్లస్ వేరియంట్స్, లామ్డా వేరియంట్ కొత్త కొత్త వేరియంట్స్ (Delta plus variant cases, Lamda variant cases) నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు జిల్లా వైద్యాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుంటూ తాజా పరిస్థితిపై సమీక్షలు చేపడుతోంది.

Also read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా వైరస్ కేసులు

ఇదిలావుంటే, గురువారం కేరళలో జికా వైరస్ పాజిటివ్ కేసులు (Zika virus positive cases) నమోదైన సంగతి తెలిసిందే. కేరళ రాజధాని అయిన తిరువనంతపురం జిల్లాలోనే తొలిసారిగా 13 జికా వైరస్ కేసులు నమోదైనట్టు కేరళ సర్కారు వెల్లడించింది. జికా వైరస్ కేసులు గుర్తించిన నేపథ్యంలో మిగతా జిల్లాలను సైతం అప్రమత్తం చేస్తూ కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Kerala health minister Veena George) ఆదేశాలు జారీచేశారు.

Also read: Dengue cases in Hyderabad: హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News