CM Revanth Reddy: రేవంత్‌ ఇలాఖాలో షాడో ఎమ్మెల్యేల హవా.. అసలు ఏంటా స్టోరీ..!

Telangana Congress Politics: సీఎం రేవంత్‌ రెడ్డి సొంత జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కాకుండా పోయిందా..! అన్ని విషయాల్లో ఆ ఎమ్మెల్యేను అనుచరులే ముందుండి నడిపిస్తున్నారా..! నియోజకవర్గం అభివృద్ధి కావొచ్చు.. ఉద్యోగుల బదిలీల్లో అనుచరుల హావానే నడుస్తోందా..! వారి మాటను కాదనలేక ఆ ఎమ్మెల్యే ఎందుకు అంతలా టెన్షన్‌ పడుతున్నారు..! అసలు ఎవరా ఎమ్మెల్యే ఏంటా స్టోరీ..!   

Written by - G Shekhar | Last Updated : Nov 5, 2024, 06:21 PM IST
CM Revanth Reddy: రేవంత్‌ ఇలాఖాలో షాడో ఎమ్మెల్యేల హవా.. అసలు ఏంటా స్టోరీ..!

Telangana Congress Politics: ఉమ్మడి మహబూబ్‌ నగర్‌లో బీఆర్‌ఎస్ కంచుకోట బద్దలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు కారు పార్టీ రెండు సీట్లకే పరిమితమైంది. అందులోనూ ఓ ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరిపోయారు. మరో ఎమ్మెల్యే కూడా త్వరలోనే హస్తం పార్టీలో చేరుతారని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ ఎన్నికల్లో మహబూబ్‌ నగర్‌లో మాజీమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను చిత్తుచిత్తుగా ఓడించారు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి. ఆయన గెలుపు అంతా ఈజీగా అయితే రాలేదని అప్పట్లోనే చర్చ జరిగింది. అయితే యెన్నం గెలుపులో నలుగురు కాంగ్రెస్‌ నేతలు కీలక పాత్ర పోషించారని అందుకే ఆయన గెలుపు సాధ్యమైందని తెలుసు.. కానీ ఇప్పుడు ఆ నలుగురు నేతలే ఇప్పుడు ఎమ్మెల్యేకు పెద్ద తలనొప్పిగా మారినట్టు జిల్లాలో టాక్ వినిపిస్తోంది..

Also Read: Flying Flea C6 Electric Bike: కుర్రాళ్లకు కిక్కిచ్చే న్యూస్.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి తొలి ఈవీ బైక్!  

మహబూబ్‌ నగర్‌లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆయన విజయం సాధించారు. కానీ.. గతేడాది అనుహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరి విజయం సాధించారు. అయితే యెన్నం పేరుకు మాత్రమే ఎమ్మెల్యే.. తెరవెనుక మాత్రం ఆ నలుగురు అనుచరులు షాడో ఎమ్మెల్యేలుగా ఉన్నారట. నియోజకవర్గంలో ఎమ్మెల్యేను అన్ని విషయాల్లో వీళ్లే హ్యాండిల్‌ చేస్తున్నారట.. పాలమూరును నాలుగు భాగాలుగా పంచుకుని అన్ని తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. పాలమూరు ఎక్కడా ఏ పని జరగాలన్నా తమకే తెలిసే చేయాలని హుకుం జారీ చేస్తున్నారట. ఇటీవల కొందరు ఉద్యోగుల బదిల్లీల్లోనూ ఓ అనుచరుడు కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. ఆయన చెప్పినట్టుగానే అధికారుల బదిలీలు జరిగాయని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.. 

ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే భావిస్తున్నారట. ముఖ్యంగా జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని అనుకుంటున్నారట.. ఇందుకోసం అయన పలుమార్లు సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి ఇదే విషయాన్ని చెప్పారట.. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు అందులోనూ చక్రం తిప్పుతున్నారట. అయితే అన్ని విషయాల్లోనూ షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహారిస్తున్న అనుచరులపై అనేక ఫిర్యాదులు వెళ్లువెత్తాయట.. దాంతో ఇదే విషయమై వారిని ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డిని గెలిపించుకుంది తామేనని పూర్తి అధికారం తమకే ఉందన్న రేంజ్‌లో సమాధానం ఇస్తున్నారట.. అయితే ఈ సమాధానం విని సొంత పార్టీ కార్యకర్తలే ముక్కున వేలేసుకుంటున్నారట.. అయితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే.. పార్టీకి లేని తలనొప్పులు వచ్చే అవకాశం ఉందని జిల్లా పార్టీ నేతలు అనుకుంటున్నారట.. అందుకే ఈ షాడో లీడర్లపై పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారట. 

మొత్తంగా తన అనుచరుల పెత్తనంపై ఎమ్మెల్యే కూడా సైలెంట్‌ గా ఉంటున్నారని మరో చర్చ సైతం జరుగుతోంది.. అయితే ఇంతా రచ్చ చేస్తున్న ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉంటున్నారనే చర్చ సైతం జరుగుతోంది. చూడాలి మరి ఈ షాడో లీడర్లను కంట్రోల్‌ చేస్తారా.. లేదంటే ఇలాగే వదిలేస్తారా అనేది తెలియాలంటే కొద్దిరోజులుగా ఆగాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Also Read: Viral Video: ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీళ్లను తాగిన భక్తులు.. చివరకు ఊహించని ట్విస్ట్.. వీడియో వైరల్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News