CM Breakfast Scheme: సీఎం కేసీఆర్ మరో సూపర్ స్కీమ్.. రాష్ట్రంలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్

CM KCR to Introduce Breakfast Scheme in Telangana: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా గిఫ్ట్ ప్రకటించారు. అక్టోబర్ 24వ తేదీ నుంచి 1వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠశాలల్లోనే బ్రేక్‌ఫాస్ట్ అందజేయనున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 15, 2023, 08:24 PM IST
CM Breakfast Scheme: సీఎం కేసీఆర్ మరో సూపర్ స్కీమ్.. రాష్ట్రంలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్

CM KCR to Introduce Breakfast Scheme in Telangana: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల సంక్షేమం కోసం మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా పాఠశాలల్లో "ముఖ్యమంత్రి అల్పాహార పథకం"ను ప్రవేశపెట్టనున్నారు. ఈ స్కీమ్‌లో భాగంగా అక్టోబర్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతుల వరకు విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. విద్యార్థులకు చక్కని బోధనతో పాటు మంచి పోషకాహారం అందిచే దిశగా  ప్రభుత్వం పథకాన్ని అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.
 
నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచేందుకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజు ఉదయాన్నే వ్యవసాయ పనులు, కూలీ పనులు చేసుకోవడానికి వెళుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. ఉదయాన్నే తమ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్‌కు పడుతున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారు. మానవీయ ఆలోచనతో ఈ అల్పాహారం పథకాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 24వ తేదీ నుంచి ఖ్యమంత్రి అల్పాహార స్కీమ్‌ను అమలు చేయనుంది.

ఈ స్కీమ్ తమిళనాడుతో విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ అమలవుతున్న విధానాన్ని పరిశీలించి రావాలని ఐఎఎస్ అధికారుల బృందాన్ని పంపించారు. అధికారుల బృందం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించి.. విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని అధ్యయనం చేశారు. ఈ స్కీమ్‌కు సంబంధించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఆ రాష్ట్రంలో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారని అధికారుల బృందం సీఎం కేసీఆర్‌కు వివరించారు. 

మన రాష్ట్రంలో అందరు విద్యార్థులకు లబ్ధి చేకూరాలని సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్టు స్కీమ్‌ను వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర సర్కారు ఖజానాపై ప్రతి యేటా దాదాపు రూ.400 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు చెబుతున్నారు. 

Also Read: Telangana Medical Colleges: దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్యరంగం.. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్

Also Read:  Nipah Virus Cases: కేరళలో హై అలర్ట్.. 6కి చేరిన నిఫా వైరస్ కేసులు, ఇద్దరు మృతి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News