BJP Group Politics: కొన్నేళ్లుగా తెలంగాణ బీజేపీలో గ్రూపు విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఎంపీలు, ఎమ్మెల్యేలు వేర్వేరు వర్గాలుగా విడిపోయారు. ఇక ఎంపీల్లో కూడా ఒక్కొక్కరిది ఒక్కో మార్గంగా మారింది. ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగాయి. వీరిద్దరూ ఏనాడూ కలిసి కనిపించలేదు. పార్టీ కార్యక్రమాల్లో వీరిద్దరూ పాల్గొంటున్నా.. వేర్వేరుగా.. దూరం దూరంగా కనిపించారు.
Also Read: Turmeric Board: పసుపు రైతులకు 'సంక్రాంతి' కానుక... నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభం
దాదాపు ఒకే వేదికపై వీరు కనిపించలేదు. ఒకవేళ కనిపించినా ఎడమొహం.. పెడమొహంగా ఉండిపోయేవారు. దీనిద్వారా పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒకే పార్టీలో ఉంటూ బద్ధ శత్రువులుగా మారిన వీరు తాజాగా ఒక్కటైనట్లు కనిపిస్తోంది. వారిద్దరినీ నిజామాబాద్ పసుపు బోర్డు కార్యాలయం ఒక్కటి చేసినట్లు కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి పాల్గొనడం చర్చనీయాంశం కాగా.. అరవింద్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు కురిపించడం మరో ఆసక్తికర పరిణామం.
Also Read: Padi Kaushik Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట.. బెయిల్‌పై విడుదల
నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో పసుపు పండించే రైతుల కోసం పసుపు బోర్డు కీలకమైనది. సుదీర్ఘకాలంగా చిరకాల వాంఛగా ఉన్న పసుపు బోర్డు కల తాజాగా సాకారమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటుచేశారు. ఈ బోర్డును మంగళవారం కేంద్ర మంత్రులు పీయూశ్ గోయల్, బండి సంజయ్‌తో కలిసి స్థానిక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు.
సానుకూల పరిణామం
ఈ బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వర్చువల్‌గా సమావేశమైన వీరిద్దరూ పరస్పరం ప్రశంసించుకున్నారు. బండి సంజయ్‌పై ధర్మపురి అరవింద్.. అతడిపై సంజయ్ ప్రశంసించారు. పసుపు బోర్డుతో వీరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరిద్దరూ కలిసోయారనే వార్తతో తెలంగాణ బీజేపీలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పార్టీలో విభేదాలు ఉన్నాయనే విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలోనే మోదీ కీలక ఉపదేశం ఇచ్చారు.
మోదీ మొట్టికాయలు
విభేదాలు పక్కనపెట్టి పని చేయాలని దిశానిర్దేశం చేయడంతో అందులో భాగంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కలిశారనే చర్చ జరుగుతోంది. అయితే పసుపు బోర్డు రెండు జిల్లాలకు సంబంధించిన అంశం కావడంతో వీరిద్దరూ కలిశారని.. కానీ వారిమధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. వారిమధ్య విభేదాలు తగ్గినా.. పెరిగినా పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.