Pension Updates: దేశవ్యాప్తంగా పెన్షన్ రూల్స్ మారనున్నాయి. దాదాపు 7 లక్షలమంది ఉద్యోుగలకు చెందిన పెన్షన్ రివిజన్ వ్యవధి, 65 ఏళ్లకు అదనపు పెన్షన్ నిబంధనలు మారనున్నాయి. యూనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది. ఇవన్నీ అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన అప్‌డేట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల ఫెడరేషన్, పెన్షన్ రివిజన్ వ్యవధిని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదన ప్రస్తావనకొచ్చింది. అదే విధంగా అదనపు పింఛన్ వయస్సు పరిమితి మార్చాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి విన్పిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కమ్యూటేన్ టేబుల్స్ గురించి వివరాలున్నాయి. కమ్యూటేషన్ పెన్షన్ అంటే ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ప్రాధమిక పింఛన్ నుంచి 40 శాతం వరకూ ఎంచుకోవచ్చు. అంటే పింఛనులో 40 శాతం ముందే పొందేందుకు అనుమతి ఇస్తారు. ఆ తరువాత ఆ మొత్తాన్ని రికవర్ చేసేందుకు పెన్షన్ నుంచి 8 వేలు మినహాయిస్తారు. గతంలో ఈ మినహాయింపు జీవితాంతం ఉండేది. కానీ కొత్త విధానంలో 15 ఏళ్లు ఉంటోంది. 15 ఏళ్ల తరువాతే పూర్తి పెన్షన్ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్‌లో 40 శాతం కంటే ఎక్కువ ఒకేసారి చెల్లించవచ్చు. పదవీ విరమణ చేసిన ఏడాదిలోపు పెన్షన్ కమ్యూటేషన్ ఎంచుకుంటే వైద్య పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.
కమ్యూటేషన్ పెన్షన్ దరఖాస్తుకు సంబంధించి బ్యాంక్ ఎక్కౌంట్ జమ తరువాత పెన్షన్ తగ్గింపు ప్రారంభమౌతుంది. కమ్యూటెడ్ పెన్షన్ గరిష్ట పరిమితి మొత్తం పెన్షన్‌లో మూడించ ఒక వంతు ఉంటుంది పదవీ విరమణ చేసిన 15 ఏళ్ల తరువాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. ఈ డిమాండ్లను ప్రస్తావిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కన్సల్టేషన్ మెషినరీ ఇప్పటికే 14 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు 15 ఏళ్లు కాకుండా 12 ఏళ్లకు తగ్గించాయి. కేరళలో 12 ఏళ్లకు సవరించారు. గుజరాత్ ప్రభుత్వం 13 ఏళ్లకు తగ్గించింది.
పెన్షన్ కమ్యూటేషన్‌కు సంబంధించి 1986లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటితే పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు, ఆయుర్దాయం, మరణాలరేటు అంశాలు పూర్తిగా మారిపోయాయి.
అదే విధంగా అదనపు పెన్షన్ వయస్సుపై చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 80 ఏళ్ల వయస్సు తరువాత 20 శాతం పెరుగుతుంది. 65-75 ఏళ్ల వారికి ఈ పరిస్థితి లేదు. కానీ ఈ వయస్సువారికే డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు తరువాత 65 ఏళ్ల నుంచి ప్రతి ఐదేళ్లకు 5 శాతం చొప్పున పెంచే డిమాండ్ ఉంది. 65 ఏళ్ల వయస్సులో 5 శాతం, 70 ఏళ్ల వయస్సులో 10 శాతం, 75 ఏళ్ల వయస్సులో 15 శాతం, 80 ఏళ్ల వయస్సులో 20 శాతం పెన్షన్ పెంచాలని ప్రతిపాదించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.