8th Pay Commission Big Updates: ప్రస్తుతం అంతా 8వ వేతన సంఘం గురించే చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం తీసుకొస్తుందా లేక ప్రత్యామ్నాయం విధానం కోసం ఆలోచిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
8th Pay Commission Big Updates: ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు ఇప్పటి వరకూ వేతన సంఘం ఉండేది. ఇకపై Aykroyd విధానం రానుందని తెలుస్తోంది. ఈ కొత్త విధానంపై గత కొద్దికాలంగా చర్చ నడుస్తోంది. ఇప్పటివరకూ ఏడాదికి రెండుసార్లు డీఏ మారడం, ఫిట్‌మెంట్ ఆధారంగా కనీస వేతనం నిర్ణయించడం జరుగుతోంది.
ఇప్పుడున్న విధానం ప్రకారం ప్రతి పదేళ్లకోసారి జీతభత్యాల పెంపు, కనీస వేతనంపై నిర్ణయం ఉంటుంది. కానీ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రతి ఏటా జీతభత్యాలు మారవచ్చు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు, విధానం ప్రకారం అన్ని కేటగరీల జీతభత్యాల్లో భారీ వ్యత్యాసం ఉంది. కానీ కొత్త విధానం అమల్లోకి వస్తే ఈ వ్యత్యాసం ఉండకపోవచ్చు
కొత్త విధానం అమల్లోకి వస్తే ఉద్యోగుల పనితీరుని బట్టి జీతభత్యాలు పెరుగుతాయి. ఉద్యోగుల పని సామర్ధ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ ఫార్ములా ప్రకారం ప్రైవేట్ ఉద్యోగులకు ఉన్నట్టే ఉద్యోగులందరికీ సమానంగా, సామర్ధ్యం ఆధారంగా వేతనం నిర్ణయం ఉంటుంది.
అయితే కొత్త విధానం అమల్లోకి వస్తే Aykroyd ఫార్ములా ప్రకారం వేతనాల నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం అనేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా నిర్ణయిస్తుంటారు. ఏడాదిలో రెండు సార్లు ఇది మారుతుంది.
8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86కు మారవచ్చు. అదే జరిగితే కనీస వేతనం 18 వేల నుంచి 51,480 రూపాయలకు పెరగనుంది. పెన్షన్ 9 వేల నుంచి 25,740 రూపాయలు కావచ్చు.
7వ వేతన సంఘం 2016 నుంచి అమల్లో ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కొత్త జీత భత్యాలు, పెంపు అనేది ఉంటుంది. దీని స్థానంలో జీతాలు పెంచేందుకు కొత్త విధానం అమలు చేయవచ్చని తెలుస్తోంది. ప్రతి ఏటా కనీస వేతనం కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది
అయితే ఇకపై కొత్త వేతన సంఘం ఏర్పర్చకుండా ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయించేందుకు కొత్త విధానం అమలు చేయవచ్చని తెలుస్తోంది. మరి ఉద్యోగుల జీతభత్యాలు లేదా పెన్షనర్ల పెన్షన్లు ఎలా నిర్ణయిస్తారనేది ఆసక్తిగా మారింది
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్లు నిర్ణయించేందుకు 7వ వేతన సంఘం ఉపయోగపడింది. ఈ ఏడాది అంటే 2025 డిసెంబర్ నెలతో ఇది ముగియనుంది. ఆ తరువాత కొత్త వేతన సంఘం అమలు కానుంది.
మరో నెల రోజుల్లో ప్రకటించనున్న కేంద్ర బడ్జెట్‌లో 8వ వేతన సంఘం ప్రకటన ఉంటుందని అంచనా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు దీనికోసమే ఆసక్తిగా చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.