Secretariat Police: తెలంగాణలో రోజురోజుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని సచివాలయం ముట్టడికి వస్తున్నారు. తాజాగా బెటాలియన్ కానిస్టేబుళ్లు కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యమ బాట పట్టడంతో కలకలం రేపుతోంది. ఉద్యమాలను అదుపు చేసే పోలీసులే ఉద్యమం చేపట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడి నివారణ చర్యలకు ఉపక్రమించింది. అయితే కానిస్టేబుళ్ల ఉద్యమానికి సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ భద్రత సిబ్బంది కూడా మద్దతునిస్తున్నట్టు తెలిసింది. దీంతో సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అనవసర వివాదాలకు వెళ్లకూడదని హెచ్చరిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేయడం సంచలనంగా మారింది.
Also Read: KTR Brother In Law: కేటీఆర్ బావమరిది పార్టీ కేసులో ఎలాంటి అరెస్ట్‌లు ఉండవు
మొత్తం ఐదు సూచనలు చేసింది. వీటిని ధిక్కరిస్తే మాత్రం వెంటనే చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సచివాలయ ప్రధాన భద్రత అధికారి పేరు మీద ఒక ప్రకటన విడుదలైంది. అయితే ఇది బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఉద్యమం కారణంగానే ఈ ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: KTR: హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్ రెడ్డి చేసిన హత్య
పోలీస్ సిబ్బందికి జారీ చేసిన సూచనలు
- రాష్ట్రానికి అతి ముఖ్యమైన సచివాలయంలో మనం విధులు నిర్వహిస్తుండడంతో మన మీద చాలా మందికి నిఘా ఉంటుంది. ఇక్కడ విధులు నిర్వహించే వారు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ పోస్టులు పెడుతున్నారు? ఇలా ఇంకా చాలా విషయాల మీద నిఘా ఉంటుంది. ఇక్కడి సిబ్బంది అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఏ ఒక్కరూ తప్పు చేసినా అందరిపై ప్రభావం పడుతుంది.
- సచివాలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ అమలులో ఉంది. ఐదుగురు కంటే ఎక్కువ గుమిగూడి ఉన్నా.. ధర్నాలు, రాస్తారోకోలు, సచివాలయ ముట్టడి లాంటి వాటిలో పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని మీ కుటుంబసభ్యులకు.. బంధుమిత్రులకు, తోటి సిబ్బందికి తెలపండి.
- మీరు చాలా వాట్సప్ గ్రూప్స్‌లకు అడ్మిన్‌గా ఉంటూ మిగతా సిబ్బందిని గ్రూపుల్లో చేరుస్తూ పోలీస్ వ్యవస్థ గురించి, పోలీస్ అధికారుల గురించి రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు. కానీ మీ ప్రతి కదలికల మీద నిఘా ఉంచారు. అందరూ కూడా తక్షణమే అటువంటి గ్రూప్స్ నుంచి తొలగిపోండి.
- మీరు, మీ కుటుంబసభ్యులు కూడా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు మొదలైన అనుమతి లేని కార్యక్రమాల్లో పాల్గొనవద్దు. అలా చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
- మీరు ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ టెలీగ్రామ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, వాట్సప్‌లలో పోలీస్ వ్యవస్థ గురించి, పోలీస్ అధికారుల గురించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం.. లైక్ చేయడం వంటివి చేయవద్దు. మీ ప్రతి కదలికల మీద నిఘా పెట్టారు. పొరపాటున మీరు దొరికితే తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
- పైన పేర్కొన్న విషయాలు దృష్టిలో ఉంచుకుని సచివాలయంలో విధులు నిర్వర్తించే పోలీస్ అధికారులు, సిబ్బంది ఎవరూ కూడా పైన తెలిపిన విషయాల్లో కలుగచేసుకోకండి. ఏమైనా తప్పు జరిగితే తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. సచివాలయంలో ఏ చిన్న తప్పు జరిగినా.. చేసినా దాని ప్రభావం పోలీస్ వ్యవస్థ మీద పడుతూ అందరం ఇక్కడ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook