Rythu Bharosa: రైతులకు భారీ శుభవార్త.. బ్యాంకుల్లో రూ.569 కోట్లు పెట్టుబడి సహాయం జమ

Rythu Bharosa Amount Rs 569 Cr Debit Into Farmers Bank Accounts: ఊరించి ఊరించి పంట పెట్టుబడి సహాయం కొంతమంది రైతులకు మాత్రమే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో.. కొంత మంది రైతులకు మాత్రమే డబ్బులు జమ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 27, 2025, 07:26 PM IST
Rythu Bharosa: రైతులకు భారీ శుభవార్త.. బ్యాంకుల్లో రూ.569 కోట్లు పెట్టుబడి సహాయం జమ

Rythu Bharosa Amount: సుదీర్ఘ కాలం తర్వాత రైతులకు భారీ శుభవార్త వినిపించింది. అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం విడుదల చేసింది. అయితే విడుదల చేసిన పెట్టుబడి సహాయం కొందరి రైతులకు మాత్రమే ఉండడంతో కొంత మంది రైతులకు ప్రయోజనం చేకూరగా.. లక్షలాది రైతులకు పెట్టుబడి సహాయం లభించలేదు. దీంతో రేవంత్‌ రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణకు భట్టి విక్రమార్క, వివేక్‌ అడ్డగింత: మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆరోపణలు

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రైతు భరోసా పేరిట పంట పెట్టుబడి సహాయం ప్రతియేటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డి ఆ హామీని నిలబెట్టుకోలేదు. రెండు విడతలుగా రావాల్సిన పెట్టుబడి సహాయాన్ని 14 నెలల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయడం ప్రారంభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా పట్టుబడి సహాయానికి శ్రీకారం చుట్టగా సోమవారం రైతుల ఖాతాల్లో డబ్బులు జమవడం ప్రారంభమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

Also Read: Pay Revision Commission: 'రెండు పీఆర్సీలు పెండింగ్‌.. ఆర్టీసీ విలీనం కోసం 15 రోజులే గడువు: జేఏసీ

ఈ సందర్భంగా జిల్లాల వారీగా విడుదలైన నిధుల వివరాలను తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. మొత్తంగా 32 జిల్లాలవ్యాప్తంగా రైతులకు పంట పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 563 మండలాలకు చెందిన 577 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు వివరించారు. మొత్తం 9,48,333 ఎకరాల భూమికి.. వారివారి ఖాతాలలో మొత్తం రూ.569 కోట్లు జమ చేసినట్లు తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు.

జిల్లాల వారీగా విడుదలైన నిధులు

ఆదిలాబాద్ జిల్లా: 17 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 6,411 మంది రైతులకు రూ.14.49 కోట్లు

భద్రాద్రి కొత్తగూడం జిల్లా: 23 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 22,242 మంది రైతులకు రూ.39.07 కోట్లు జమ

హన్మకొండ జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,545 మంది రైతులకు రూ.14.30 కోట్లు

జగిత్యాల జిల్లా: 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 22,242 మంది రైతులకు రూ.39.07 కోట్లు

జనగామ జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,320 మంది రైతులకు రూ.15.91 కోట్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 7,073 మంది రైతులకు రూ.8.67 కోట్లు

జోగులాంబ గద్వాల జిల్లా: 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 7,829 మంది రైతులకు రూ.12.47 కోట్లు.

కామారెడ్డి జిల్లా: 22 మండలాల్లోని 24 గ్రామాలకు చెందిన 9,062 మంది రైతులకు రూ.8.35 కోట్లు

కరీంనగర్ జిల్లా: 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 14,226 మంది రైతులకు రూ.15.96 కోట్లు

ఖమ్మం జిల్లా: 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 20,802 రైతులకు రూ.28.42 కోట్లు

కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: 15 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 4,344 మంది రైతులకు రూ.8.62 కోట్లు

మహబూబాబాద్ జిల్లా: 18 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 14,611 మంది రైతులకు రూ.18.14 కోట్లు

మహబూబ్ నగర్ జిల్లా: 16 మండలాల్లోని 16 గ్రామాలకు చెందిన 14,575  మంది రైతులకు రూ.17.27 కోట్లు

మంచిర్యాల జిల్లా: 16 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 7,143 మంది రైతులకు రూ.8.72 కోట్లు

మెదక్ జిల్లా: 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 14,833 మంది రైతులకు 14.06 కోట్లు

మేడ్చల్ జిల్లా: 5 మండలాల్లోని 5 గ్రామాలకు చెందిన 2,706 మంది రైతులకు రూ.3.14 కోట్లు

ములుగు జిల్లా: 9 మండలాల్లోని 9 గ్రామాలకు చెందిన 6,678 రైతులకు రూ.8.26 కోట్లు

నాగర్ కర్నూల్ జిల్లా: 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 16,806 మంది రైతులకు రూ.23.05 కోట్లు

నల్లగొండ జిల్లా: 31 మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన 35,568 మంది రైతులకు రూ.46.93 కోట్లు

నారాయణపేట జిల్లా: 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,348 మంది రైతులకు రూ.13.87 కోట్లు

నిర్మల్ జిల్లా: 18 మండలాల్లోని 18 గ్రామాలకు చెందిన 7,912 మంది రైతులకు రూ.10.56 కోట్లు

నిజామాబాద్ జిల్లా: 31 మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన 35,568 మంది రైతులకు రూ.46.93 కోట్లు

పెద్దపల్లి జిల్లా: 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,885 మంది రైతులకు రూ.10.14 కోట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 9,724 మంది రైతులకు రూ.12.26 కోట్లు

రంగారెడ్డి జిల్లా: 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 15,597 మంది రైతులకు రూ.20.32 కోట్లు

సంగారెడ్డి జిల్లా: 25 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 19,933 మంది రైతులకు రూ.24.15 కోట్లు

సిద్దిపేట జిల్లా: 26 మండలాల్లోని 26 గ్రామాలకు చెందిన 31,170 మంది రైతులకు రూ.36.76 కోట్లు

సూర్యాపేట జిల్లా: 23 మండలాల్లోని 23 గ్రామాలకు చెందిన 29,352 మంది రైతులకు రూ.37.84 కోట్లు

వికారాబాద్ జిల్లా: 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 8,609 మంది రైతులకు రూ.11.18 కోట్లు

వనపర్తి జిల్లా: 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 9,441 మంది రైతులకు రూ.12.25 కోట్లు

వరంగల్ జిల్లా: 11 మండలాల్లోని 11 గ్రామాలకు చెందిన 11,386 మంది రైతులకు రూ.12.86 కోట్లు 

యాదాద్రి భువనగిరి జిల్లా: 17 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 17,576 మంది రైతులకు రూ.26.95 కోట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News