Ex Minister KTR: కోమటిరెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్.. దమ్ముంటే మీటింగ్ పెట్టు: కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

KTR Nalgoda Tour: కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 40 శాతం మాత్రమే రుణమాఫీ చేసిందని.. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌పై పోరాటం మొదలైందని.. మంత్రులను ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 28, 2025, 03:52 PM IST
Ex Minister KTR: కోమటిరెడ్డి  ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్.. దమ్ముంటే మీటింగ్ పెట్టు: కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

KTR Nalgoda Tour: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్గొండలో బీఆర్ఎస్ జోష్ చూస్తుంటే సంతోషంగా ఉందని చెప్పారు. తాము నల్గొండలో  నిర్మించిన ఐటీ టవర్ కళ తప్పిందని.. ధాన్యం దిగుబడుల్లో తెలంగాణ భారత్ దేశానికి కేసీఆర్ నంబర్ వన్ చేశారని అన్నారు. ప్రతి ఇంచుకి సాగు నీరు ఇచ్చారు కేసీఆర్ అని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి భరోసా ఇస్తామని అన్నారని.. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతులను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఆగిపోతుందని చెప్పామని.. తాము చెప్పినట్లే జరిగిందన్నారు. ఓట్లప్పుడు మాత్రమే ఒక్కసారి రైతు బందు వేశాడని అన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి.. అందుకే మళ్లీ డబ్బులు వేస్తామని మాట మార్చారని మండిపడ్డారు. 100 శాతం రుణమాఫీ చేయలేదని.. కేవలం 40 శాతం మందికే రుణ మాఫీ చేశారని అన్నారు.

"కాంగ్రెస్ వాళ్లను గ్రామ సభల్లో నిలదీస్తున్నారు. ఎక్కడికెళ్లినా  దుమ్ము దులుపుతున్నారు. 15 వేలు భరోసా అని ఇప్పుడు 12 వేలు ఇచ్చి మోసం చేస్తుండు. దరఖాస్తులు అడుగుతూ  ప్రజలను నిలువునా మోసం చేస్తుండు. బోనస్ అన్నాడు అది లేదు.. తీరా సన్న ధాన్యం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. అన్ని డ్రామాలు చేస్తుండు. కేసీఆర్ ఆనవాళ్లు  లేకుండా చేస్తా అన్నాడు రేవంత్.. అందుకే  ఇప్పుడు రైతు బంధు  నిలిపివేయాలని కుట్ర చేస్తుండు. ఒక్కో రైతుకు ఎకరాకు  17,500 బాకీ ఉన్నాడు. 

అవి అన్ని ఇయ్యాలి. కాంగ్రెస్ వాళ్లను నిలదీయాలి. నల్లగొండ నుంచే కాంగ్రెస్‌ను చీల్చి చెండాడాలి. పోరాటం మొదలైంది. తెలంగాణ అంతా  సర్వ నాశనమైంది. మంత్రులను ఎక్కడికక్కడ నిలదీయాలి. నల్లగొండలో మంత్రి  కోమటిరెడ్డి  ఓవర్ యాక్షన్ చేస్తుండు. చాలా వల్గార్‌గా మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డికి దమ్ముంటే మీటింగ్ పెట్టి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. రైతులకు ఏం చేశారో చెప్పాలి. హైకోర్టుకు ధన్యవాదాలు. మాకు ధర్నాకు అనుమతి ఇచ్చారు. న్యాయo బ్రతికే ఉంది. అధికారుల్లారా జాగ్రత్త. మళ్లీ మేమే వస్తాం.. అన్ని చూసుకుంటాం.." అని కేటీఆర్ అన్నారు. 

Also Read: Nita Ambani Gift: చిన్న కోడలు రాధికకు అత్త నీతా అంబానీ మరో ఖరీదైన 'ఆభరణం' గిఫ్ట్‌

Also Read: Mauni Amavasya: కుంభమేళాకు వెళ్లలేకపోతున్నారా..? ఇవి చేస్తే కుంభమేళాకు వెళ్లినంత పుణ్యఫలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News