Nubia Z60 Ultra Price: చైనాలో గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అంటే గుర్తుకు వచ్చేది Nubia కంపెనీ.. ఈ కంపెనీ శక్తివంతమైన గేమింగ్ మొబైల్స్‌కి ప్రసిద్ధి. అయితే ఈ కంపెనీ త్వరలోనే తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలపబోతోంది. కంపెనీ అతి త్వరలోనే శక్తివంతమైన Nubia Z60 అల్ట్రా మోడల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని నుబియా కంపెనీ మొదట చైనా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చి ఆ తర్వాత గ్లోబల్ లాంచింగ్ చేయనుంది. ఇది ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌పై పని చేయనుంది. దీంతో పాటు ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జూలై 23న విడుదల?
కొత్త ప్రాసెసర్‌తో Nubia Z60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ముందుగా చైనాలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ జూలై 23న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన పేరును అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇటీవలే లీక్ అయిన వివరాల ప్రకారం దీనిని Nubia Z60s అల్ట్రా పేరుతో తీసుకు రాబోతున్నట్లు టిప్‌స్టర్స్ వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 24GB ర్యామ్‌తో రానుంది. ఈ మొబైల్‌ను కంపెనీ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు రానుంది. అయితే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధరను తర్వలోనే వెల్లడించనుంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ఈ Nubia Z60 Ultra స్మార్ట్‌ఫోన్ OLED డిస్ప్లే సెటప్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఈ డిస్ల్పే 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. ఇది 6.8-అంగుళాల 1.5K రిజల్యూషన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు మరెన్నో కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇతర ఫీచర్స్:
6000mAh బ్యాటరీ
IP68 స్థాయి డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్
80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్
50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరా
64-మెగాపిక్సెల్ 3.2x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)
12-మెగాపిక్సెల్ అండర్ డిస్ప్లే ఫ్రంట్ కెమెరా
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి