Infinix Note 30 5G @ Rs 13,000: ప్రస్తుతం చాలా మంది కెమెరా అధిక మోగా పిక్సెల్ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే మీరు కూడా ఇలాంటి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. పవర్ ఫుల్ 108ఎంపీ కెమెరాతో కూడిన Infinix Note 30 5G స్మార్ట్ ఫోన్ డెడ్ ఛీప్ ధరల్లో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్‌ను ఎలా కొనుగోలు చేస్తే డెడ్ ఛీప్ ధరల్లో లభిస్తుందో, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ఆఫర్‌ల కారణంగా Infinix Note 30 5G డెడ్ ఛీప్ ధరల్లో లభిస్తోంది. ఈ ఆఫర్స్ జూన్ 22 నుంచే ప్రారంభం కాగా వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరల్లో ఈ స్మార్ట్ ఫోన్‌ను విక్రియిస్తునట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్టాక్ పెట్టిన 40 నిమిషాల్లో ఖాళీ అవుతున్నాయి. అయితే ఈ మొబైల్ పై మరో సారి జూన్ 29న ఆఫర్ పెట్టబోతునట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది..అంతేకాకుండా ఫ్లిప్‌కార్టుకు అనుసంధాన బ్యాంక్‌లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తునట్లు సమాచారం.
Infinix నోట్ 30 5G ధర:
ఇన్ఫినిక్స్ నోట్ 30 ప్రస్తుతం రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదటి వేరియంట్ 4GB RAM ర్యామ్ కలిగిన స్మార్ట్ ఫోన్ రూ. 14,999 ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్ విషయానికొస్తే.. 8GB RAM, 256GB స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.15,999లకు విక్రయిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి మీ ర్యామ్‌ను సెట్ చేసుకోవచ్చు.
Also Read: Tata Group IPO: టాటా గ్రూప్ నుంచి 19 ఏళ్ల తరువాత ఐపీవో, ఎలా ఉంటుందంటే
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే అదనంగా 10% తగ్గింపు లభిస్తుంది. PNB క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై 12% తక్షణ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ పై 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తోంది. వీటిని వినియోగించి ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే దాదాపు రూ. 13,000లకే లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్ల ద్వారా కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను డెడ్ ఛీప్‌గా పొందవచ్చు.
Infinix Note 30 5G స్పెసిఫికేషన్:
✵ 6.78-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
✵ 120Hz రిఫ్రెష్ రేట్ కూడిన డిస్‌ప్లే
✵ NEG గ్లాస్ ప్రొటెక్షన్
✵ MediaTek డైమెన్సిటీ 6080 ప్రాసెసర్
✵ MemFusion సాంకేతికత
✵ Android 13 ఆధారిత XOS సాఫ్ట్‌వేర్
✵ ట్రిపుల్ కెమెరా సెటప్
✵ 108MP ప్రైమరీ కెమెరా
✵ AI లెన్స్ సెన్సార్
✵ 16MP ఫ్రంట్ కెమెరా
✵ 5000mAh బ్యాటరీ
✵ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Also Read: Pancard Correction: పాన్‌కార్డులో తప్పులుంటే ఇంట్లో కూర్చుని ఇలా సరిచేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి