Google Pixel 7 At Lowest Price: ప్రస్తుతం చాలా మంది యువత Google Pixel 7 స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మెగ్గు చూపుతున్నారు. అయితే మీరు కూడా Google బ్రాండ్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్ సువర్ణావకాశం అందిస్తోంది. ప్రత్యేక డీల్స్‌లో భాగంగా అతి తక్కువ ధరల్లో గూగుల్ కంపెనీకి సంబంధించిన మొబైల్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక డీల్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ. 10,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో Google Pixel 7 స్మార్ట్‌ఫోన్స్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో Google Pixel 7a స్మార్ట్‌ఫోన్ వివిధ రంగుల్లో, స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా నాలుగు కలర్స్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర MRP రూ. 43,999తో కంపెనీ విక్రయిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి 9 శాతం తగ్గింపుతో రూ.39,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఈ Google Pixel 7a స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంచ్ చేసేవారికి దాదాపు రూ.3500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఇతర బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి కూడా తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కూడా డెడ్ ఛీప్ ధరకే పొందవచ్చు.
ఎక్చేంజ్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు, ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.38,700 తగ్గింపుతో పాటు అదనంగా రూ.2,000 వరకు బోనస్ కూడా లభిస్తోంది. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ 128 GB స్టోరేజ్ కలిగిన Google Pixel 7a స్మార్ట్‌ఫోన్ రూ.1,299కే పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్ ఆఫర్ పూర్తి మొత్తంలో పొందడానికి, మీరు ఎక్చేంజ్ చేసే స్మార్ట్‌ఫోన్ ప్రీమియం బ్రాండ్‌కు సంబంధించి కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా కండీషన్ కూడా చాలా బాగుండాల్సి ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 7ఏ స్మార్ట్‌ఫోన్ టాప్ 10 ఫీచర్స్:
గూగుల్ టెన్సార్ G2 చిప్‌సెట్: ఈ ఫోన్ లో 5nm ప్రాసెస్ తో తయారైన శక్తివంతమైన టెన్సార్ G2 చిప్‌సెట్ ఉంది. ఇది మెరుగైన పనితీరు, AI ఫీచర్స్, ఫోటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుంది.
10.8MP సెల్ఫీ కెమెరా: ఫోన్ ముందు భాగంలో 10.8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది HDR+ సాంకేతికతతో అందుబాటులోకి వచ్చింది.
6.1-అంగుళాల OLED డిస్‌ప్లే: ఫోన్ లో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేతో FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
50MP డ్యూయల్ రియర్ కెమెరాలు: బ్యాక్ సెటప్‌లో 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరాలు లభిస్తున్నాయి.
4614mAh బ్యాటరీ: ఇందులో 4614mAh సామర్థ్యం గల బ్యాటరీతో పాటు 24 గంటల వరకు బ్యాకప్ ఇస్తుంది.
టైటాన్ M2 సెక్యూరిటీ చిప్: అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌తో లభిస్తోంది.
5G కనెక్టివిటీ: ఫోన్ 5G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.
Android 13 ఆపరేటింగ్ సిస్టమ్: ఈ స్మార్ట్‌ఫోన్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది.
గూగుల్ అసిస్టెంట్: ఈ మొబైల్ గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.
త్వరిత ఛార్జింగ్: ఈ గూగుల్ పిక్సెల్ 7ఏ స్మార్ట్‌ఫోన్ 25W త్వరిత ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి