Flipkart Refrigerator Offers 2025: ఎండా కాలం ప్రారంభం కాకముందే వేడి తీవ్ర ఊహించని స్థాయిలో పెరుగుతూ వస్తోంది. దీని కారణంగా చాలా మంది ఏసీలు, రిఫ్రిజిరేటర్స్ కొనుగోలు చేస్తున్నారు. దీని కారణంగా చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు కొత్త కొత్త రిఫ్రిజిరేటర్స్‌ను విడుదల చేస్తున్నాయి. మీరు కూడా ఎప్పటి నుంచో అతి తక్కువ ధరలో మంచి ఫ్రిడ్జ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఫ్రిడ్జ్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రిఫ్రిజిరేటర్స్ డెడ్ చీప్ ధరల్లోనే లభిస్తున్నాయి. అయితే ఈ ఫ్లిఫ్‌కార్ట్ ప్రస్తుతం అత్యంత చీప్ ధరకే లభిస్తున్న ఫ్రిడ్జ్ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గతంలో CANDY అనే ఎలక్ట్రిక్ కంపెనీ లాంచ్ చేసిన 165 లీటర్స్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 1 స్టార్ రిఫ్రిజిరేటర్ ఫ్లిఫ్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రస్తుతం CSD1761RM మోడల్ నెంబర్‌తో లభిస్తోంది. అయితే ఈ ఫ్రిడ్జ్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీని అసలు ధర రూ.13,490 కాగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో దాదాపు 25 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్స్ పోనూ కేవలం ఇది రూ. 9,990కే లభిస్తోంది. అయితే ఇవే కాకుండా ఈ రిఫ్రిజిరేటర్పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా పొందవచ్చు.
ఇక ఈ రిఫ్రిజిరేటర్పై ఉన్న బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అదే విధంగా ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లించేవారికి కూడా 5 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఈ ఆఫర్స్ పోనూ రూ.8,490కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ పొందవచ్చు. అలాగే ఈ ఆఫర్స్ కొన్ని డెబిట్ కార్డులపై కూడా ఉన్నాయి.
ఫ్లిఫ్‌కార్ట్ సమ్మర్ ఆఫర్స్ సందర్భంగా ఈ రిఫ్రిజిరేటర్పై ప్రత్యేకమైన ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా వినియోగిస్తున్న పాత ఫ్రిడ్జ్‌ను ఎక్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 5,350 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఇలా ఆఫర్స్ రూ. 3,190కే ఈ కొత్త కాండీ 165 ఎల్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 1 స్టార్ రిఫ్రిజిరేటర్‌ను పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్ ఆఫర్ అనేది పాత ఫ్రిడ్జ్ కండీషన్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. పాత రిఫ్రిజిరేటర్ కండీషన్ బాగుంటే ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి