MP Soyam Bapu : పెళ్లి వేడుకల్లో సోయం బాపు చిందులు వేశారు. తన కొడుకు పెళ్లి వేడుకల్లో సోయంబాపురావు సందడి చేశారు. వివాహా అనంతరం ఆదివాసి సంప్రదాయ పాటలకు డ్యాన్సులు వేశారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా కనిపించారు.
Telangana Rains : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
Telangana Rains : తెలంగాణలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరో వైపు వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడురోజుల్లో తేలిక పాటి వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు ఏపీలో వడగాలులు కొనసాగుతున్నాయి.
CM KCR : ఇవాళ, రేపు సీఎం కేసీఆర్ వరుస సమావేశాలతో హీట్ పెంచబోతోన్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరగన్నాయి. కొత్త సచివాలయంలో మొదటి సారిగా భేటీ జరగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటాయా? అనే దానిపై చర్చించుకోనున్నారు.
Khammam : ఖమ్మం నగరంలో చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. చెరువు బజార్ ఏరియాలో బుర్ఖా వేసుకున్న వ్యక్తి ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. పెద్దలు అక్కడే ఉండటంతో మెల్లిగా జారుకునే ప్రయత్నం చేశాడు.
Summer Temparature : భానుడి భగభగలతో రెండు తెలుగు రాష్ట్రాలు మండిపోతోన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఠారెత్తిపోతోన్నాయి. మూడు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.
Summer Temparature : రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండిపడుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. గత వారంలో వర్షాలతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉండటంతో జనాలు అల్లాడిపోతోన్నారు.
Foxconn Interconnect Technology in Hyderabad: కొంగరకలాన్‌లో ఫాక్స్ కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ కంపెనీకి మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. కంపెనీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. టెక్నాలజీ ఉద్యోగాలు 33 శాతం తెలంగాణ నుంచి ఉండడం గర్వకారణమని అన్నారు.
Bandi Sanjay Comments on Ektha Yatra: ఆదివారం నాడు కరీంనగర్ లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో కలిసి హిందూ ఏక్తా యాత్ర నిర్వహించిన బండి సంజయ్ రజాకార్ల రాజ్యాన్ని పాతరేసి రామరాజ్యాన్ని స్థాపించేందుకు పాటు పడదామని అన్నారు.
Summer Heat : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండేట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండ్రోజుల పాటు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
10th Results : తెలంగాణ పది పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. మంత్రి సబితా రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు.
EAMCET : తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం కానుంది. తొలిరోజు అగ్రికల్చర్ విభాగంలో రెండు విడుతల్లో ఎగ్జామ్ జరగనుంది. తొలి రోజు 57, 775 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. తెలంగాణలో 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
KCR Govt : ఈ నెల 9న సాయంత్రం ఐదు గంటల్లోపు పంచాయితీ కార్యదర్శులు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. డ్యూటీలో చేరకపోతే విధుల్లోంచి తొలగిస్తామని హెచ్చరించింది. జూ. పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేయడంపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Bura Narasaish Goud : ఈ నెల 18న నాగోల్‌లో బీజేపి ఓబీసీ సమ్మేళనం జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను బూర నర్సయ్య గౌడ్ ఆవిష్కరించారు. ఓబీసీ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు.
Police Dept : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్ నగరంలో కొత్తగా నలభై పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని జీవో జారీ చేసింది. హైద్రాబాద్‌లో పన్నెండు ఏసీపీ జోన్లు, సైబరాబాద్‌లో మూడు డీసీపీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Amar Raja Company : తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్లో పర్యటించారు. దివిటిపల్లి వద్ద సుమారు రూ. 270 ఎకరాల్లో అమర్ రాజా లిథియం బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.
Hyderabad Rains : తెలంగాణలో మరొక రెండ్రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే హైద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.