COVID-19 tests | హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై కేంద్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేయనున్నట్టు రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు ( Bandi Sanjay ). మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనావైరస్ టెస్టులు సరిగా చేయడం లేదని, కరోనాపై యుద్ధం చేస్తోన్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, ఇతర అధికారులకు పిపిఈ కిట్లు అందించడంలోనూ జాప్యం చోటుచేసుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు.
COVID-19 in AP| అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మున్ముందు కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏపీ సర్కార్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పరిశ్రమల శాఖ పరిధిలోని ఉద్యోగులకు ఇంటి నుంచే పని ( Work from home ) చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ అదేశాలు జారీ చేశారు.
Telangana secretariat| హైదరాబాద్: తెలంగాణకు తాత్కాలిక సచివాలయంగా పనిచేస్తోన్న బూర్గుల రామకృష్ణా రావు భవన్లో ( BRKR Bhavan ) కరోనావైరస్ కలకలంరేపింది. బిఆర్కెఆర్ భవన్‌లోని 8వ అంతస్తులో అటెండర్, ఆఫీస్ బాయ్‌గా సేవలు అందిస్తున్న ఇద్దరికి కరోనావైరస్ సోకినట్టు ( COVID-19) తెలుస్తోంది. కరోనావైరస్ బారిన పడిన ఇద్దరూ తండ్రీకొడుకులేనని సమాచారం.
Telangana CMO staff: హైదరాబాద్: తెలంగాణ సీఎం కార్యాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసు వెలుగుచూడటంతో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని తీవ్ర కలవరానికి గురిచేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో అనుబంధంగా మెట్రో రైల్ భవన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కరోనావైరస్ సోకినట్టుగా అధికారులు గుర్తించారు.
Coronavirus positive cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 206 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 206 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని తాజాగా సర్కారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసింది. జూన్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు ( TS SSC exams ) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ఇటీవల హై కోర్టుకు ( TS govt ) ప్రభుత్వం వివరించింది. ఒక్కో పరీక్ష మధ్య రెండు రోజుల గ్యాప్ కూడా ఇస్తున్నారు.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ( Bandi Sanjay ) నల్గొండ జిల్లా పెద్దవూర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెద్దవూర మండల పరిధిలోని బత్తాయి తోటలను పరిశీలించి రైతులను కలిసేందుకు వచ్చిన బండి సంజయ్... అక్కడే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన వెంట బీజేపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన స్థానిక నేతలు కూడా ఉన్నారు.
లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలకు ఇటీవల కేంద్రం పలు షరతులతో కూడిన సడలింపు ఇవ్వడంతో మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో మద్యం దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి.
లాక్ డౌన్ సమయంలోనే మద్యం డోర్ డెలివరీ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ తాజాగా వైన్ షాపుల వద్దే మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ కొత్తగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది.
లాక్‌డౌన్‌ను పాటిస్తేనే కానీ కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదు. అందుకే ప్రపంచదేశాలన్నీ విధిగా లాక్ డౌన్, సోషల్ డిస్టన్స్ నిబంధనలను పాటిస్తూ కరోనాను నివారించేందుకు కృషి చేస్తున్నాయి. ఇంట్లోంచి బయటికొస్తే చాలు... కరోనా వైరస్ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది.
విదేశాల నుండి వచ్చిన వారి నుండి కరోనావైరస్ (Coronavirus) వ్యాపిస్తున్న కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లొచ్చిన వారిని (Foreign travel hostory) అధికారులు ఎక్కడికక్కడే క్వారంటైన్ హోమ్స్‌కి (Quarantine homes) తరలిస్తున్న సంగతి తెలిసిందే.
కరోనావైరస్ను అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా నిత్యం ఏదో ఓ బిజీ షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉండే సెలబ్రిటీలు ఈ లాక్డౌన్ సమయాన్ని తమకు తోచినట్టుగా సరదాగా గడుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.