గణతంత్ర దినోత్సవం సందర్భంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుదీర్ఘంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలపై మానవత్వం చూపింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 231 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారిలో 212 మంది జీవిత ఖైదీలు, 19 మంది జీవితేతర ఖైదీలు ఉన్నారు.
Tihar Jail Prisoner Suicide: ఢిల్లీలోని తిహార్ జైలులో ఐదుగురు ఖైదీలు ఆత్యహత్యకు యత్నించారు. షార్ప్ వెపన్స్ తో తమకు తామే గాయపరుచుకున్న ఘటన తిహార్ జైలులో జరిగింది. జైలు సిబ్బంది వీరిని అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. ఐదుగురిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Prison ATM In Bihar | బీహార్ రాష్ట్రంలోని ఖైదీలు ఇక తమ జైలులోనే ఏటీఎం సేవలను వినియోగించుకోగలరు. బీహార్ లోని పూర్ణియా జైలులో ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేసి ఖైదీలు తమ నిత్యావసరాల కోసం డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.